ముగ్గురు మహిళల ఆత్మహత్యాయత్నం
Published Fri, Feb 28 2014 3:14 AM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM
రాజాంరూరల్, న్యూస్‌లైన్: వేర్వేరు కారణాలతో జిల్లాలో ముగ్గురు మహిళలు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జి.సిగడాం మండలం జగన్నాథవలస గ్రామానికి చెందిన షిండేటి లక్ష్మి తన భర్తతో గొడవపడి గన్నేరుపిక్కలు మింగింది. అలాగే, సంతకవిటి మండలం రంగారాయపురం గ్రామానికి చెందిన గేదెల లక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురై పురుగు మందు సేవించింది. చీపురుపల్లి రోడ్డులోని ఫైర్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న చిప్పాడ పద్మ అలియాస్ సుజాత కడుపు నొప్పికి తాళలేక పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. షిండేటి లక్ష్మి, చిప్పాడ పద్మను ఆటోపైన, గేదెల లక్ష్మిని బైక్‌పై స్థానికులు రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. వీరికి ఆస్పత్రి సూపరింటెండెంట్ గార రవిప్రసాద్ చికిత్సనందించారు. ఆయా మండల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement