
పాదయాత్ర బృందాన్ని అభినందిస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
చిత్తూరు, తిరుపతి రూరల్: జగన సీఎం కావాలని మొక్కుకున్న గుంటూ రు జిల్లా తెనాలి మండలం ము న్నంగికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆ గ్రా మం నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు. గత నెల 18న మున్నంగిలో ప్రారంభమైన ఈ యాత్ర 16 రోజులు పాటు కొనసాగి శుక్రవారం తిరుపతికి చే రింది. వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలోని పాదయాత్ర బృందం తుమ్మలగుంట వద్ద వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కలిసింది.
ఆయన వారిని అభినందించారు. వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాకంటక పాలన నడుస్తోందన్నారు. తెనాలి ఎమ్మెల్యేగా అన్నబత్తుని శివకుమార్ గెలవాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని కోరుకుంటూ మున్నంగి నుంచి ఈ పాదయాత్రగా తిరుమలకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పెసర్లంక రమణ, శంకర్, వెంకటేష్, నాని, రాజశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment