భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం
సాక్షి, తిరుపతి: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం లక్షలాది మంది తిరుమలకు చేరుకోవడంతో రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్డుల్లో కూడా భక్తులు నిండిపోవడంతో మిగతావారిని తిరువీధిలోకి టీటీడీ ఆధికారులు తరలిస్తున్నారు.
మంగళవారం వేకువ జామున రెండు గంటలకు వీఐపీలకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని, ఉదయం ఐదు గంటల నుంచి సామాన్యలకు దర్శనం ఉంటుందని టీటీడీ ఆధికారులు తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో తిరుమలలోని చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమలకు చేరుకున్న ప్రముఖులు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. టీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి తదితరులు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment