ఐఐటీ రూర్కీ విద్యార్థులు పేర్కొన్నట్టు భూకంపం వచ్చే సూచనలకు సంబంధించిన సమా చారాన్ని వెంటనే నిర్ధారించలేమని, దీనిపై పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. తిరుపతి, తిరుమల ప్రాంతాల్లోని భూమి పొరల్లో ఉన్న రాతిపలక ఒకే పలకగా ఉండడం వల్ల భూకంపం వచ్చే అవకాశాలు తక్కువే అన్నారు. ఐఐటీ విద్యార్థులు తెలిపినట్టు తమిళనాడులో భూకంపం వస్తే తిరుపతిలో స్వల్ప కదలికలు ఉండవచ్చని, అయితే అవి ప్రమాదకరం కాదన్నారు. భూకంపం వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవన్నారు. కాగా, భూమి లోపల టెక్టోనిక్ పలకల నిరంతర కదలిక వల్ల దక్షిణాదిలో విపత్తు సంభవించే ప్రమాదం ఉందని ఐఐటీ రూర్కీ విద్యార్థులు హెచ్చరించారు. తమిళనాడులోని పాబర్, తరంగం బాడి ప్రాంతాల్లో టెక్టోనిక్ ప్లేట్లు ఢీ కొనడం వల్ల భూకంపాలు వస్తాయని, ఒక వేళ అక్కడ భూకంపం సంభవిస్తే దాని ప్రభావం 200 కిలోమీటర్ల పరిధి వరకు ఉంటుందని పేర్కొన్నారు.
తిరుపతికి భూకంప ప్రమాదమేమీ లేదు
Published Tue, Sep 19 2017 3:25 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM