నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ : రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 175 ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేయడానికి తగిన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు రాకుండా అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో మొత్తం 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, అందులో 6 లక్షల టన్నులు బీపీటీ రకం ధాన్యం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసినట్లు వివరించారు. బీపీటీ ధాన్యం ధరను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందన్నారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ధాన్యాన్ని తాత్కాలికంగా నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. జేసీ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ పీఏసీఎస్, డీసీఎంఎస్‌లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. వీటితో పాటు ఐకేపీ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భిక్షం యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, మేనేజర్ భిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు చేస్తాం
Published Wed, Oct 9 2013 4:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement