
డీజిల్‌తో నడిచే మూడు చక్రాల ‘బుల్లెట్ బండి’తో తక్కువ ఖర్చుతో వ్యవసాయ పనులను చేసుకుంటున్నారు నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కౌలు రైతు. నల్లగొండ మండలం రసూల్ పుర గ్రామానికి చెందిన రైతు గుండెబోయిన జానయ్య 8 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేస్తున్నారు. మినీ ట్రాక్టర్ తరహాలో అనేక వ్యవసాయ పనులకు ఉపయోగిస్తున్నారు.
గుజరాత్ నుంచి తెప్పించుకొని వాడుతున్న మరో రైతు దగ్గర నుంచి బుల్లెట్ బండిని రూ. 60 వేలకు జానయ్య గత ఏడాది కొన్నారు. అంతర సేద్యానికి గుంటక తోలటం, ఎరువులు వేయడానికి, పురుగుల మందు పిచికారీకి పత్తి, కూరగాయలు తదితర మెట్ట పంటల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉందన్నారు.
లీటర్ డీజిల్‌తో ఎకరం దున్నుకుంటున్నానన్నారు. ఇతరుల పొలాల్లో గుంటక కొడితే గంటకు రూ. వెయ్యి తీసుకుంటానని జానయ్య (96761 47981) తెలిపారు. – కంది భజరంగ్ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ
చదవండి: Mosambi Cultivation: లాభాల బుట్టలో రైతు.. బత్తాయి కాయలకు తాటాకు బుట్టలు తొడిగి!
Maharashtra: ఇక నల్లేరుపై బండి నడకే!.. బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించే ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment