జైనూర్, న్యూస్‌లైన్ : మన ఊరు కాదు.. దేశం కాదు. భాష కూడా తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్క టే.. ఆదివాసీ గిరిజనులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి దరిచేర్చడం. అందుకు అనుగుణం గా ప్రణాళిక రూపొందించారు. అలా ఆదివాసీ గిరిజనుల గుండెల్లో గూడు కట్టుకున్నారు లండన్ దేశానికి చెందిన ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు. వారికి ఆరాధ్య దైవాలుగా మారారు.
శనివారం వారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్ 1930 లో మానవ పరిణామక్రమంపై పరిశోధన చే స్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. గిరిజనుల స్థితిగతులపైనా అధ్యయనం చేశా రు. 1940లో కొమురం భీమ్ భూ పోరాటం ని జాం ప్రభుత్వంతో సాగుతోంది. ఇది గిరిజనులకు, ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. భీమ్ మరణానంతరం నిజాం ప్రభుత్వం గిరిజనులకు మేలు చేయడానికి సంకల్పించింది. దీంతో ఇక్కడి గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చే యడానికి హైమన్‌డార్ఫ్‌ను పంపించింది. గిరి జనుల సమస్యలు పరిష్కరించడమే కాకుండా వారి డిమాండ్లనే తీర్చాలని నిజాం ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకుని జిల్లాలో గిరిజను లు ఉన్న ప్రాంతాలకు వచ్చారు.
భూమిపై హ క్కు కోసం భీమ్ పోరాటం సాగిందని తెలుసుకున్న ఆయన ఆ కాలంలోనే గిరిజనులు సాగు చేసుకున్న భూములకు పట్టాలు ఇప్పించారు. అన్ని రంగాల్లో గిరిజనులు వెనుకబడి ఉన్నార ని, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదించారు. గిరిజన గ్రామాల్లో పెద్దలతో చర్చించి ఆసిఫాబాద్, జై నూర్, సిర్పూర్(యు), గిన్నేదరి ప్రాంతాల్లో స్వచ్ఛంద పాఠశాలలను ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ పాఠశాలలను ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలుగా గు ర్తించింది. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయా లు గొప్పవని తెలుసుకుని వాటిని ఆచరించా రు. 1940 నుంచి మార్లవాయి గిరిజన గ్రామం లో నివాసం ఏర్పర్చుకుని వస్తూ పోతుండేవా రు. ఈ అధ్యయనంలో హైమన్‌డార్ఫ్‌కు ఆయ న భార్య బెట్టి ఎలిజబెత్ చేదోడు వాదోడుగా నిలిచింది.
ఆమె కూడా ఇక్కడే ఉంటూ గిరిజ నుల అభివృద్ధి కోసం కృషి చేశారు. 1986లో హైదరాబాద్‌లో జాతీయ గిరిజన సదస్సులో గిరిజనుల స్థితిగతులపై వివరించేందుకు నివేదిక సిద్ధం చేస్తుండగా బెట్టి ఎలిజబెత్ అక్కడే హఠాన్మరణం పొందారు. ఆమె కోరిక మేరకు మార్లవాయి గ్రామంలో గిరిజన సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. భార్య సమాధి పక్కనే తన సమాధి కట్టించి అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించాలని హైమన్‌డార్ఫ్ పేర్కొన్నారు. ప్రతిసారి ఎలిజబెత్ వర్ధంతికి హాజరై గిరిజనులతో కలిసి ఉండేవారు. గిరిజనులతో మమేకం అయిన ఆయన తన కుమారుడికి లచ్చుపటేల్(నికోలస్) అని నామకరణం చేశారు. ఐటీడీఏ ఏర్పడిన తర్వాత అప్పటి అధికారులతో సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయించారు.
11 ఏళ్ల తర్వాత.. తండ్రి కోరిక తీర్చిన తనయుడు
స్వదేశం లండన్‌కు వెళ్లిన హైమన్‌డార్ఫ్ వృద్ధాప్యంతో 1995లో మృతిచెందారు. హైమన్‌డార్ఫ్ కోరిక మేరకు మార్లవాయిలో నిర్మించిన సమాధిలో అస్థికలను నిమజ్జనం చేయడానికి ఆయన కుమారుడికి 11ఏళ్లు పట్టింది. 2012 ఫిబ్రవరి 27న కుమారుడు నికోలస్(లచ్చుపటేల్) తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అస్థికలను గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేశారు. కాగా, మార్లవాయిలో హైమన్‌డార్ఫ్ దంపతుల వర్ధంతికి అన్ని ఏర్పాట్లు చేశారు.
గిరిజనుల ఆరాధ్య దైవం హైమన్‌డార్ఫ్
Published Sat, Jan 11 2014 2:15 AM | Last Updated on Tue, Jun 4 2019 6:39 PM
Advertisement