కోదాడటౌన్, న్యూస్‌లైన్ : కోదాడలో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని నాగార్జున సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తోపాటు ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్‌తో పాటు గాదరి కిశోర్, జగదీశ్వరరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పదివేల మంది విద్యార్థులతో కోదాడలో మహాప్రదర్శనకు ఏర్పాటు చేస్తున్నట్లు టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు తెలిపారు. రెండు రోజులుగా టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కె.శశిధర్ పట్టణంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ నాయకులు అధిక సంఖ్యలో రావాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో మట్టపల్లి శ్రీనివాసగౌడ్, కుక్కడపు బాబు, తుపాకుల భాస్కర్, యల్లేశ్వరరావు, మైసయ్య, అంజయ్య, జేఏసీ నాయకులు పందిరి నాగిరెడ్డి, జీఎల్‌ఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.