ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం కలియుగ వైకుంఠవాసుడు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గురువారం నుంచే భక్తజనం పోటెత్తారు. భక్తులతో తిరుమల కొండ నిండిపోయింది. నడిచొచ్చే భక్తులతో కాలిబాట మార్గాలు కిక్కిరిశాయి.
ఏకాదశి పర్వదినమైన శుక్రవారం దర్శనం కోసం గురువారం వేకువజాము అర్ధరాత్రి 12.01 నుండే భక్తులను క్యూ లైన్లోకి అనుమతించారు. కాగా ఏకాదశి పర్వదిన దర్శనంలో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని.. అందుకనుగుణంగానే భారీ ఏర్పాట్లుచేశామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. అభిషేకం కారణంగా నాలుగు గంటలపాటు స్వామి దర్శనం ఆలస్యమవుతోందన్నారు. సామాన్య భక్తులు, ప్రముఖులు కూడా టీటీడీకి సహకరించాలన్నారు. –సాక్షి, తిరుమల
Comments
Please login to add a commentAdd a comment