Mukkoti Ekadashi
-
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు ప్రారంభం
-
రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినం
-
తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతున్నారు. ఉత్తర ద్వారా దర్శనం కోసం తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయాల ప్రాంగణాలన్ని కిక్కిరిసిపోతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో.. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వారాన్ని సుందరంగా అలంకరణ చేసింది టీటీడీ. గర్భాలయం నుండి మహా ద్వారం వరకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. 12 టన్నుల పుష్పాలతో తిరుమలని వైకుంఠంగా తీర్చిదిద్దారు. అదనంగా.. విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకోగా.. భక్త జనం పోటెత్తుతోంది. ఇక తిరుమల వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్న టిటిడి ఛైర్మన్ వై..వి. సుబ్బారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ‘‘అర్దరాత్రి 1.30 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించాం. ముందుగా నిర్ణయించిన మేరకే ఉదయం 6 గంటలకు సర్వ దర్శనం ప్రారంభించాం. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతి ఉంటుంది. తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు తీసుకొని తిరుమల రావాలి. ఆన్ లైన్ లో రోజుకు 20 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేశాం. తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వ దర్శన టోకెన్లు నాలుగున్నర లక్షలు జారీ చేస్తున్నాం అని తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో స్వర్ణ రథంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. యాదాద్రిలో తొలిసారి.. యాదాద్రి చరిత్రలో మొదటిసారిగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తున్నారు. పునర్నిర్మానం తర్వాత తొలిసారిగా ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నార లక్ష్మీనరసింహ స్వామి. ఉదయం 6.48 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కొనసానుంది. ద్వారకా తిరుమలలో.. ఏలూరు జిల్లా చిన్నతిరుపతి ద్వారకా తిరుమల ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న దర్శించుకుంటున్నారు భక్తులు. గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం. వీఐపీలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి ఇరుముడి సమర్పిస్తున్నారు గోవింద స్వాములు. భద్రాచలం రాములోరి చెంత.. భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి ఆలయంలో మంగళ వాయిద్యాలు, వేదఘోష నడుమ తెరుచుకుంది వైకుంఠ ద్వారం. ఉదయం 5.01 గంటల నుంచి 5.11 గంటల వరకు వినతాసుత వాహన కీర్తన నాదస్వరం నిర్వహించారు. ఉదయం 5.11 గంటల నుంచి 5.21 గంటల వరకు ఆరాధన, శ్రీరామ షడ క్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. 5.30 గంటల నుంచి 5.40 గంటల వరకు స్థానాచార్యులచే ద్వార దర్శన ప్రాశస్తం చెప్పబడింది.ఆ తర్వాత 108 ఒత్తులతో హార తినిస్తూ శరణాగతి గద్యవిన్నపం చేశారు. ఉదయం 6 గంటలకు అదిగో కోదండపాణి కీర్తనతో వైకుంఠ ద్వారం నుంచి శ్రీ స్వామి వారి ఉత్థాపన జరిగింది. ఆపై భక్తులకు స్వామి మూలవరుల దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌక ర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాడపల్లిలో భక్తుల కిటకట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో.. కోనసీమ తిరుమలగా పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోవింద నామస్మరణతో మారుమోగింది ఆలయ ప్రాంగణం. దర్శనానంతరం ఉచిత ప్రసాద వితరణ స్వీకరించారు భక్తులు. రాజన్నసిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వార భక్తులకు దర్శనం ఇచ్చారు హరి హరులు. స్వామి వార్లను దర్శించుకున్నారు భక్తులు. ఉత్సవ మూర్తులను ఆలయంలోనే పల్లకి సేవ, పెద్ద సేవలపై మూడు సార్లు ప్రదక్షిణలు చేయించి భక్తులకు దర్శనం కల్పించారు. మహా హారతి అనంతరమే కోడె మొక్కులు, ఆర్జిత సేవలు ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా వైఎస్సార్ జిల్లా.. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై కొలువు దీరాడు జగదభి రాముడు. తెల్లవారు జామున 5 గంటల నుండి సీతానాయకుని దర్శనం కోసం పోటెత్తింది భక్తజనం. గోవింద నామ స్మరణతో మార్మోగుతోంది కోదండ రామాలయం. ఇక.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు తొలి గడప దేవుని కడపలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీవారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు ఓరుగల్లు ఆలయాలకు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారం ద్వార ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. బట్టలబజార్ లోని బాలానగర్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు. హన్మకొండ ఎక్సైజ్ కానీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారా ద్వార స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు.గోవింద నామ స్మరణతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం. -
వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ భారీ ఏర్పాట్లు
-
విజయవాడలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతి
-
నిరాడంబరంగా తెప్పోత్సవం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించే తెప్పోత్సవాన్ని బుధవారం నిరాడంబరంగా ఆంతరంగికంగానే జరిపించారు. స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా హంసవాహనంతో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి వారిని వేంచేపు చేశారు. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర తీర్థంతో సంప్రోక్షణ చేసిన తర్వాత ప్రత్యేక పూజలు, ఆరాధన, ఏకాంత తిరుమంజనం, నివేదన, దర్బారు సేవలను జరిపించారు. ఇక గురువారం తెల్లవారుజామున నిర్వహించే ఉత్తర ద్వార దర్శనాన్ని సైతం నిరాడంబరంగానే జరపనున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విద్యుత్ లైట్ల అలంకరణలో భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం -
ఏపీలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
సాక్షి, అమరావతి : ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారిని దర్శించు కోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా.. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై కోదండరాముడు కొలువు దీరాడు. తెల్లవారు జామున 5 గంటల నుంచే సీతారామ లక్ష్మణుల దర్శనం కోసం భక్తజనం పోటెత్తారు. కోదండ రామాలయం మొత్తం గోవింద నామ స్మరణతో మార్మోగిపోయింది. తూర్పు గోదావరి జిల్లా.. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యనారాయణ స్వామిని ఉత్తరద్వారం దిశగా భక్తులు దర్శించుకుంటున్నారు. శేష పానుపు పై సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మి సత్యవతి అమ్మవార్లు ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఉత్తర ద్వారం గుండా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. విశాఖపట్నం.. సింహచల వరహా లక్ష్మీ నరసింహ స్వామి ఆయలం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సిద్దమైంది. పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కోవిడ్ నియామాలు అనుసరించి భక్తులు దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.దేవస్థాన ఛైర్మన్ సంచయిత గజపతి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో పాటు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. గుంటూరు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 3.30 గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. కోవిడ్ కారణంగా అధికారులు ఆలయంలో శంఖు తీర్థం నిలిపివేశారు.60సంవత్సరాల వృద్ధులు, 10 సంవత్సరాలు లోపు పిల్లలకి గుడిలోకి అనుమతించలేదు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జిల్లా .. తిరుమలేశుని తొలి గడప దేవుని కడప ఆలయానికి భక్తులు పోటెత్తారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున నుంచే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా.. ద్వారక తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ఉత్తర ద్వారం వైపు వెండి గరుడవాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భక్తులు దర్శించుకుంటున్నారు. సాధారణ, విఐపి భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయగా.. క్యూలైన్లన్ని గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. -
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వ్రతాన్ని ఆచరిస్తున్న భక్తులకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. -
దివి నుంచి భువికి ముక్కోటి
వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. సంక్రాంతిలాగే ఇది కూడ సౌరమానాన్ననుసరించి జరిపే పండుగలలో ఒకటి. కర్కాటక సంక్రమణం, ధనుస్సు నెల పట్టిన తరువాత శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరమాసంలో లేదా పుష్యమాసంలో వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున ఆ నిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి – భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగివచ్చాడట. అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ముక్కోటి నాడు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణం చేత ఈ పండుగను దక్షిణాదిన కొన్ని ప్రాంతాలలో స్వర్గద్వారం అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రత కలది కావడం చేత దీనికీ పేరు వచ్చిందని చెబుతున్నారు. ‘కృతయుగంలో చంద్రావతి అనే నగరం రాజధానిగా చేసుకొని ‘ముర‘ అనే అసురుడు రాజ్యపాలనం చేస్తూ ఉండేవాడు. వాడు దేవతల్ని గారిస్తూ వచ్చాడు. అప్పడు దేవతలు వెళ్లి వైకుంఠంలో విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల దీనాలాపాలు విని అప్పడు విష్ణువు వైకుంఠాన్నుంచి భూమి మీదకు దిగి వచ్చి మురాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ సంహారం ఈ ఏకాదశినాడు జరిగింది. విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి భూమి మీదకు వచ్చి శత్రుసంహారం చేసిన రోజు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ పర్వదినాన దేవాలయాల ఉత్తరద్వారాన శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రప్రమాణం. ఈరోజే శ్రీరంగ క్షేత్రాన శ్రీరంగ దేవాలయంలో ద్వారస్థ భగవదాలోకన మహోత్సవం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గల అన్ని విష్ణ్వాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈరోజు ఏం చేయాలి? ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి పటాన్ని గంధంతోటీ, జాజిమాలతోటీ అలంకరించి ఆయనకు ప్రీతికరమైన పాయసంతో పాటు వివిధరకాల తీపిపదార్థాలను లేదా ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించడం విశిష్ట ఫలదాయకమని పెద్దలు చెబుతారు. అన్నింటికీ మించి ఈ పర్వదినాన స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం, విష్ణులీలలను తెలిపే గ్రంథాలను భగవద్భక్తులకు దానం చేయడం, విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఉపవసించడం, యథాశక్తి దాన ధర్మాలు చేయడం, జాగరణ చేయడం వలన మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుమలలోనూ, ఉడిపిలోనూ, గురువాయూర్లోనూ, అరసవిల్లి, శ్రీకూర్మం, లోనూ, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలోనూ, భద్రాద్రిలోనూ, యాదాద్రిలోనూ ఇంకా అనేకానేక ఆలయాలో నేడు భక్తులు తెల్లవారు జామునుంచే స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని పులకాంకితులవుతారు. -
వైకుంఠ’ దర్శనానికి భక్త కోటి
-
వైకుంఠ’ దర్శనానికి భక్త కోటి
ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం కలియుగ వైకుంఠవాసుడు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గురువారం నుంచే భక్తజనం పోటెత్తారు. భక్తులతో తిరుమల కొండ నిండిపోయింది. నడిచొచ్చే భక్తులతో కాలిబాట మార్గాలు కిక్కిరిశాయి. ఏకాదశి పర్వదినమైన శుక్రవారం దర్శనం కోసం గురువారం వేకువజాము అర్ధరాత్రి 12.01 నుండే భక్తులను క్యూ లైన్లోకి అనుమతించారు. కాగా ఏకాదశి పర్వదిన దర్శనంలో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని.. అందుకనుగుణంగానే భారీ ఏర్పాట్లుచేశామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. అభిషేకం కారణంగా నాలుగు గంటలపాటు స్వామి దర్శనం ఆలస్యమవుతోందన్నారు. సామాన్య భక్తులు, ప్రముఖులు కూడా టీటీడీకి సహకరించాలన్నారు. –సాక్షి, తిరుమల -
వైభవంగా ముక్కోటి ఏకాదశి
రామతీర్థం(నెల్లిమర్ల): ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గురువారం శ్రీరాముడు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పర్వదినం సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున నాలుగు గంటలనుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. అలాగే ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో మెట్లోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువజామున మూడుగంటలకు ఆలయాన్ని కోనేటిజలంతో శుద్ధిచేశారు. అనంతరం స్వామివారికి సుప్రభాతసేవ జరిపించారు. తరువాత బాలభోగం నిర్వహించి..మంగళాశాసనం జరిపించారు. ఉదయం 5గంటలకు సీతాసమేత స్వామివారితో పాటు లక్ష్మణుడు, ఆంజనేయుడి విగ్రహాలను పల్లకిలో ఉంచి మేళతాళాలతో ఊరేగింపుగా ఉత్తరద్వారం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ భక్తుల దర్శనార్థం వేంచేపుచేశారు. అప్పటినుంచి ఉదయం 8గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులుతీరారు. అనంతరం ఉదయం 8గంటలకు పల్లకిలో స్వామివారిని ఊరేగింపుగా తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లారు. వర్షం కారణంగా తిరువీధి కార్యక్రమాన్ని రద్దుచేశారు. ఘనంగా మెట్లోత్సవం స్థానిక కోందండరామస్వామి వారి ఆలయానికి వెల్లే బోడికొండ మెట్లకు ఘనంగా ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9గంటలకు అధికసంఖ్యలో మహిళలు కొండవద్దకు చేరుకుని ఒక్కోమెట్టుకు పసుపురాసి, బొట్టుపెట్టారు. నెల్లిమర్ల, విజయనగరానికి చెందిన శ్రీవారి సేవాసంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొది మెట్టువద్ద పూజలుచేసి కోందండరామస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘హరే శ్రీనివాసం’ప్రాజెక్టుకు చెందిన మహిళాసభ్యులు కొండపై కోలాటం ప్రదర్శించారు. అలాగే పలువురు భక్తులు భజనలు చేశారు. శ్రీరాముడ్ని దర్శించుకున్న కేంద్రమంత్రి అశోక్ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు రామతీర్థం ఆలయానికి ఉదయం 7గంటల ప్రాంతంలో వచ్చి ఉత్తరద్వారంలో వేంచేసిన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అశోక్ పేరున ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలోని మూలవిరాట్టును అశోక్ దర్శించుకున్నారు. అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, మల్లికార్జునశర్మ మంత్రికి ఆశీర్వచనం చేశారు. అలాగే ఆలయంలో నెలకొన్న సమస్యలను అర్చకులు మంత్రికి వివరించారు. ఆయన వెంట మిమ్స్ వైద్యకళాశాల చైర్మన్ అల్లూరి మూర్తిరాజు, ఎయిమ్స్ విద్యాసంస్థల ఛైర్మన్ కడగల ఆనంద్‌కుమార్, టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు గేదెల రాజారావు తదితరులున్నారు. తోటపల్లిలో సీతారామకల్యాణం తోటపల్లి(గరుగుబిల్లి): మండలంలోని తోటపల్లి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీసీతారామస్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం సుప్రభాతసేవ, నిత్యారాధన,విశేష హోమములు,పాశురవిన్నపం, మంగళాశాసనం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హనుమత్ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులకు తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామస్వామి ఆలయంలో ఉత్తరద్వారంగుండా భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అలాగే గరుగుబిల్లిలోని శ్రీషిర్డిసాయిబాబా ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార ప్రవేశాన్ని భక్తులకు కల్పించారు. శ్రీకోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారామస్వామివారి కల్యాణాన్ని ప్రముఖ యజ్ఞకర్త ఎస్వీఎల్ఎన్ శర్మయాజి, ఆలయ అర్చకులు పి. గోపాలకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణంలో హోమం,యజ్ఞోపవీతధారణ తదితర కార్యక్రమాలును నిర్వహించారు. ముక్కోటి ఏకాదశినాడు లోకకల్యాణార్థం స్వామివారికి కల్యాణం చేస్తే అంతా శుభం జరుగుతుందని అర్చకులు శర్మయాజి తెలిపారు. కల్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాలనుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. కల్యాణంలో పాల్గొనే భక్తులకు అన్నదానకార్యక్రమానికి ప్రముఖన్యాయవాది ఎన్.రఘురాం సహా యంచేసినట్లు ఈఓ ఆర్.నాగార్జున తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయసిబ్బంది ఎం. మురళీమోహన్, ఎం.బలరాంనాయుడులు పర్యవేక్షించారు. విజయనగరం మండలం కోరుకొండ సమీపంలో గల ఆధ్యాత్మిక క్షేత్రం రామనారాయణంలో ముక్కోటి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. -
వైకుంఠ ఏకాదశి వైభవం
-
రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కిలోమీటర్ల మేర నిలిచి ఉన్నారు. తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు వీఐపీ దర్శనం కొనసాగింది. శ్రీవారి 5 వేల మంది వీఐపీలు దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 18గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేశారు. భద్రాచలంలో ఉత్తర ద్వారం నుంచి సీతారామ చంద్రస్వామి దర్శనమిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమించుకుంటున్నారు. ద్వారకా తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదాశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వార నుంచి స్వామివారిని భక్తులు దర్శనం ఇస్తున్నారు. ఇక శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉత్తర ద్వారం నుంచి మల్లన్న దర్శనమిస్తున్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోనూ భక్తులు బారులు తీరారు. కరీంనగర్ జిల్లా వేములవాడకు భక్తులు పోటెత్తారు. అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనానికి వేలాది భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువజాము నుంచి వేచి ఉన్నారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు వేలాది తరలివచ్చారు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్‌లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువ జామున మూడు గంటల నుంచే దేవాలయాల వద్ద భక్తులు క్యూలు కట్టారు. బంజారా హిల్స్ లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తుల భారీ సంఖ్యలో ఆలయాలకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జియా గూడలోని రంగనాథస్వామి ఆలయంలో వేలాది భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి ఉన్నారు. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
పరశు‘రాముడు’
‘‘ ధరలో క్షత్రియులను దండించిన ‘పరశురాముడు’-మనపాలిట నుండగ... తక్కువేమి మనకు.. ‘రాముండొక్కడుండు’ వరకు...’’ తన తండ్రి జమదగ్నిని చంపిన వేయి చేతులు గల కార్యవీర్యార్జునుని సంహరించి.. ఇరువది ఒక్క పర్యాయములు భూమినంతా గాలించి దుష్టులైన వారిని సంహరించుటకు శ్రీ మహావిష్ణువు పరశురామావతారం ఎత్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సోమవారం భార్గవరామునిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారంలో ఉన్న స్వామివారిని తిలకించి శుభఫలితాలు పొందినట్లు అర్చకులు తెలిపారు. భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామాలయంలో నిర్వహిస్తున్న పగల్‌పత్తు ఉత్సవాల్లో రాజాధిరాజు అయిన శ్రీరాముడు సోమవారం పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు కొలువై ఉన్న ఆళ్వార్లుకు వేదపండితులు 200 పాశురాల దివ్యప్రబంధనాన్ని వినిపించారు. ఉత్సవమూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లి పరశురామావతరంలో అలంకరించారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. భక్తుల కోలాహలం, మేళతాళాలు, మహిళల కోలాటాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డు వరకు తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదిక మీదకు తీసుకువచ్చి భక్తుల దర్శనం కోసం ఉంచారు. స్వామివారికి ప్రత్యేక హారతి, నైవేద్యాన్ని సమర్పించారు. పరశురామావతార విశిష్టతను ఆలయ అర్చకులు అమరవాది మదనమోహానాచార్యులు రాగయుక్తంగా వినిపించారు. స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు పంపిణీ చేశారు. వేదపండితుల వేదఘోష నడుమ తాతగుడిసెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించటం ఆనవాయితీ. స్టేడియం నుంచి తిరువీధి సేవకు బయలుదేరిన స్వామివారికి రాజవీధి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గంమధ్యలోని విశ్రాంతి మండపంలో కొద్దిసేపు స్వామివారు సేద తీరారు. అనంతరం స్వామివారిని ఆలయానికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎం. రఘునాథ్, ఏఈవో శ్రవణ్‌కుమార్, వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, సన్యాసిశర్మ, ఆలయ అర్చకులు విజయరాఘవన్, ఓఎస్డీ సుదర్శన్, పీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నేడు శ్రీరామునిగా.. లోకకంఠకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుని కుమారునిగా శ్రీ మన్నారాయణుడు ధరించిన శ్రీరామావతారంలో వైకుంఠ రాముడు మంగళవారం దర్శనమివ్వనున్నారు. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణయే ఉత్తమమైనదని, అదే శాశ్వతమైనదని శ్రీరాముడు లోకానికి చాటిచెప్పారు. పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. సూర్యగ్రహ బాధలున్న వారు రామావతారాన్ని దర్శించటం వల్ల ఆ బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.