నేడు హైదరాబాద్‌కు సింగపూర్ పిళ్లై | today Singapore Pillai in to Hyderabad | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్‌కు సింగపూర్ పిళ్లై

Published Thu, May 21 2015 3:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

today Singapore Pillai in to Hyderabad

హైదరాబాద్: రాజధాని నిర్మాణం, మాస్టర్‌ప్లాన్‌పై సింగపూర్ నియమించిన గోపీనాథ్ పిళ్లై గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన సమావేశమవుతారు. రాజధాని నిర్మాణంపై స్విస్ చాలెంజ్ విధానంలో పరస్పర ఆమోదయోగ్యంగా ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చలు జరుపుతారు.

ఈ విషయాన్ని ఉన్నతస్థాయి వర్గాలు బుధవారం వెల్లడించాయి. కాగా ఈ నెల 25న సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా కేపిటల్ రీజియన్ మాస్టర్‌ప్లాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈశ్వరన్ అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement