ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా ఈ నెల 17న ఖమ్మం నెహ్రూనగర్‌లోని సంఘం భవన్‌లో పెన్షనర్స్ డే జరుగుతుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్యాణం కృష్ణయ్య, రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రాలను వారు ఆదివారం ఖమ్మంలో ఆవిష్కరించారు. అనంతరం, వారు మాట్లాడుతూ.. ఖమ్మంలో జరిగే ‘పెన్షనర్స్ డే’కు జిల్లాలోని పెన్షనర్లంతా పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
పలువురు పెన్షనర్లను ఈ కార్యక్రమంలో సన్మానించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్‌పీ ఎవి.రంగనాధ్, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, డీఈఓ రవీంద్రనాధ్ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య, ట్రెజరీ డిప్యూటీ డెరైక్టర్ నీలిమ తదితరులు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటేశ్వరావు, ప్రచార కార్యదర్శి రాధాకృష్ణారావు, కోశాధికారి డికె.శర్మ, సభ్యులు హనుమంతరావు, రాఘవరావు, జనార్ధన్, లక్ష్మారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రేపు పెన్షనర్స్ డే
Published Mon, Dec 16 2013 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement