ఒంగోలు: జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను ఈ నెల 22వ తేదీన (రేపు) నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య ప్రణాళికాధికారి ఎ.ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకే స్టేషన్‌లో మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది అందరికీ ఈ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మండల ప్రజాపరిషత్‌లు, ఇంజినీరింగ్ విభాగాలలో పనిచేస్తున్న వివిధ క్యాడర్లలోని సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.
కౌన్సెలింగ్‌పై మళ్ళీ ఉత్కంఠ
కౌన్సెలింగ్ వ్యవహారం ఈసారైనా సక్రమంగా జరుగుతుందా..లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఒక దఫా అంటే ఈనెల 15వ తేదీ కౌన్సెలింగ్ ప్రారంభించి వారంరోజులపాటు బదిలీలకు అవకాశం కల్పించడంతో అధికారులు కౌన్సెలింగ్‌ను ఏవో కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో మళ్లీ ఈ నెల 22న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలంటూ ప్రకటించారు.
జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో కొనసాగుతున్న పీటముడి వీడకపోవడంతో ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఉద్యోగులు మాత్రం పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఈసారి కూడా వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది.
రేపు మళ్లీ జడ్పీ కౌన్సెలింగ్
Published Fri, Nov 21 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement
Advertisement