కాకినాడ: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నడిమాండ్ తో మంత్రి తోట నరసింహం భార్య తోట వాణి ఆరు రోజులుగా చేస్తున్న దీక్షను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భగ్నం చేశారు. కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో దీక్షాభగ్నం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు, అక్కడున్న కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీక్షను భగ్నం చేసిన తర్వాత ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆరోగ్యం క్షీణించించడంతో తోట వాణి దీక్షను అధికారులు భగ్నం చేశారు. ఆమె శరీరంలో సోడియం స్థాయి గణనీయంగా పడిపోయిందని, రక్తపోటు పెరిగి మధుమేహం స్థాయి కూడా పడిపోయిందని కాకినాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ వెంకట బుద్ధ తెలిపారు. దీక్ష విరమించకపోతే ఆమె ఆరోగ్యం బాగా విషమించే ప్రమాదమున్నట్లు ఆయన వివరించారు.
తోట వాణి ఆరోగ్యం క్షీణించిన విషయం తెలియడంతో కాకినాడలో మంత్రి అనుచరులు ప్రధాన రహదారులన్నింటినీ దిగ్బంధించారు. భానుగుడి సెంటర్కు దారితీసే దారులన్నింటినీ దాదాపుగా మూయించారు. కార్యకర్తలు వీధులన్నింటిలో మోటారు సైకిళ్లపై తిరుగుతూ దుకాణాలు, సినిమా థియేటర్లను మూయించారు. ఒక మహిళ ఇన్నాళ్లుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదంటూ సమైక్యవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తోట వాణి దీక్ష భగ్నం
Published Fri, Aug 16 2013 4:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement