
ట్రాఫిక్ రామస్వామి
సీఎం జయలలిత ఫ్లెక్సీలను చూసి, సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. పోలీసులతో ఢీ కొట్టారు. వారితో వాగ్యుద్ధానికి దిగారు. చివరకు ట్రాఫిక్ రామస్వామికి అధికారులు తలొగ్గక తప్పలేదు. వారు కూడా ఫ్లెక్సీలను తొలగించాల్సి వచ్చింది.
చెన్నై : చెన్నై మహా నగరవాసులకు ట్రాఫిక్ రామస్వా మి సుపరిచితుడు. జనంతో మమేకమై. జనం కోసం... వారి హక్కులను ఇంటి వద్దకే చేర్చటం కోసం ప్రభుత్వాలను, బడా వ్యాపారవేత్తలను, సమాజాన్ని నిలదీ స్తూ, సామాజిక బాధ్యతలను అందరికీ విశదీకరిస్తున్న ఓ సామాన్యుడే ఈ ట్రాఫిక్ రామస్వామి. 79 ఏళ్ల వయస్సులోనూ అలుపెరుగని యోధుడిలా ప్రజా హక్కు ల కోసం కోర్టుల్లో ఉద్యమిస్తూ వస్తున్నా రు. నగరంలో ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థ ప్రస్తుతం గాడిలో పడిందంటే ఆయన ప్రాత ఎంతో ఉం ది. ఇటీవల నగరంలో విచ్చలవిడిగా, ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్న ఫ్లెక్సీలు, రాజకీయ బ్యానర్లపై రామస్వామి దృష్టి పెట్టారు. కోర్టులో పిటిషన్ వేసి పెద్ద సమరమే చేశారు. ఎట్టకేలకు నగరంలో బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు ఆంక్షలు, అనుమతులు తప్పనిసరి అయ్యాయి.
ఆగ్రహం: పోయేస్ గార్డెన్ మార్గంలో సీఎం జయలలిత దృష్టిలో పడే విధంగా అన్నాడీఎంకే నాయకులు తరచూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఈ మార్గంలో ఇష్టారాజ్యంగా వెలసి ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లపై ట్రాఫిక్ రామస్వామి దృష్టి పడింది. ఆగ్రహానికి లోనైన ఆయన శనివారం స్వయంగా రంగంలోకి దిగారు. అక్కడున్న ఓ ఫెక్సీని చించేశారు. దీన్ని గుర్తించిన అక్కడి భద్రతా సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగిస్తారా..? తొలగించమంటారా..? అంటూ పోలీసులతో ఢీ కొట్టారు.
వాగ్యుద్ధం: ఆగ్రహంతో బ్యానర్లను తొలగించేందుకు దిగిన ట్రాఫిక్ రామస్వామిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆయన అందుకున్నారు. బ్యానర్ల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాల్సి ఉందని, ఏర్పాటు చేసిన నిర్ణీత కాల వ్యవధిలో తొలగించాల్సి ఉందని వివరించారు. అయితే, ఇక్కడున్న బ్యానర్లు, ఫెక్సీలు ఎప్పుడు ఏర్పాటు చేశారో, దీన్ని తొలగించేందుకు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారో తనకు తెలుసునని, కోర్టులో తేల్చుకుంటానంటూ గదమాయిండం తో పోలీసులు వెనక్కు తగ్గారు.
దీంతో ముందుకు కదిలిన రామాస్వామి అక్కడున్న మరో రెండు ఫ్లెక్సీల్ని చించిపడేశారు. చివరకు అధికారులు రామస్వామికి హెచ్చరికకు తలొగ్గాల్సి వచ్చింది. అక్కడ రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాటిని తొలగించారు. అన్నీ తొలగించి నా, రామస్వామిలో మాత్రం ఆగ్రహం చల్లార లేదు. కోర్టులో తేల్చుకుంటానంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు.