traffic ramaswamy
-
ప్రముఖ సామాజిక కార్యకర్త, ట్రాఫిక్ రామస్వామి ఇకలేరు
సాక్షి, చెన్నై: ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి (87) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని వారాలుగా చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. ప్రధాన సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు నిరంతరాయంగా పాటు పడుతూ, ట్రాఫిక్ పోలీసులకు సహాయం చేస్తూ వచ్చిన ఆయన ట్రాఫిక్ రామస్వామిగా పాపులర్ అయ్యారు. అంతేకాదు నగరంలో విచ్చలవిడిగా వెలిసే ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్లపై రామస్వామి ఎనలేని పోరాటమే చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. దీంతో పలువురు రామస్వామిమృతిపై సంతాపం వ్యక్తం చేశారు. వన్ మేన్ ఆర్మీలా చాలా పోరాటాల్లో ఒంటరిగానే నిలిచారనీ గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్ చేశారు. అదీ ఆయన నిబద్ధత, ప్రత్యేకత అంటూ పలువురు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. Traffic Ramasamy sir was a true trailblazer. Questioned the system in ways no body dared to. A lot in my closest circle always voted for him. He fought alone. Stood alone. I’ll always remember him. pic.twitter.com/UaALKrsqtd — Chinmayi Sripaada (@Chinmayi) May 4, 2021 ముఖ్యంగా రాజకీయ నాయకుల, సినీ ప్రముఖులు రోడ్లపై ఏర్పాటు చేసే పెద్ద హోర్డింగ్‌లకు వ్యతిరేక పోరాటాలతోనే ఆయన జీవితమంతా సాగిపోయింది. పడే హోర్డింగ్ కారణంగా టెక్కీ సుబశ్రీ మరణించిన తరువాత హైకోర్టులో రామస్వామి పోరాటం బెదిరింపులకు వ్యతిరేకంగా కీలకమైన ఒక చట్టం రూపొందింది. ప్రజాశ్రేయస్సుకోసం అనేక సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకునేవారు. పాలక పార్టీలు, రాజకీయ నాయకులపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో అనేకసార్లు అరెస్టయ్యారు. జైలుకు కూడా వెళ్లారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై రామస్వామి పెట్టిన అనేక కేసులు మద్రాసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఫ్లెక్సీలను తానే స్వయంగా చించివేసి వార్తల్లో నిలిచారు. అందుకే ఆయన ట్రాఫిక్ రామస్వామిగా తమిళ ప్రజలకు అభిమాన పాత్రుడయ్యారు. -
లైన్ క్లియర్!.. తీర్పు ఆలస్యం?
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, కలైంగర్ కరుణానిధి అంత్యక్రియలపై నెలకొన్న ప్రతిష్టంభన దాదాపు వీడింది. ఈ వ్యవహారంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి(84) ప్రకటించారు. దీంతో రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు గతంలో దాఖలైన అభ్యంతరాల పిటిషన్లను(ఐదింటిని) మద్రాస్ హైకోర్టు బెంచ్ డిస్మిస్ చేసింది. అయితే కరుణానిధి అంత్యక్రియలపై దాఖలైన పిటీషన్‌పై మాత్రం వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై అత్యవసర తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడటంతో.. తీర్పును కాస్త ఆలస్యంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. (కరుణానిధి అరుదైన ఫోటోలు.. క్లిక్ చేయండి) గతంలో మెరీనా బీచ్‌లో పలువురి స్మారకాలపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణ అంత్యక్రియలకు ఆ పిటిషన్ ఆటంకంగా మారింది. కోర్టు కేసుల నేపథ్యంలో అంత్యక్రియలకు స్థలం కేటాయించలేమని పళని ప్రభుత్వం పేర్కొంది. దీంతో డీఎంకే హైకోర్టును ఆశ్రయించగా.. గత రాత్రి నుంచి ఈ వ్యవహారంపై వాదనలు జరిగాయి. చివరకు తదుపరి వాదనలు ఈ ఉదయానికి వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో ఉత్కంఠ నెలకోగా, రామస్వామితో చీఫ్ జస్టిస్ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతనే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు జరిపితే ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ రాతపూర్వకంగా ఆయన బెంచ్‌కు ఓ మెమొరాండం సమర్పించారు. అంతేకాదు పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కోర్టులో ప్రభుత్వం, డీఎంకే తరపు న్యాయవాదుల మధ్య వాడివేడి వాదనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు అత్యవసరంగా తీర్పు ప్రకటించాల్సిన అవసరం లేదన్న చీఫ్ జస్టిస్.. ఈ రోజే తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. (నిండు సభలో దుశ్శాసన పర్వం) ‘తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని’ జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు. తాము వేసిన పిటిషన్ల ఆధారంగానే న్యాయపరమైన చిక్కులున్నట్లుగా భావిస్తే.. ఆ కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు కూడా. కానీ, రామస్వామి పిటిషన్ మూలంగానే న్యాయపరమైన చిక్కుల నెలకొన్నాయన్న విషయం తర్వాతే తేలింది. (అమ్మకు ఘన నివాళి) (కరుణ వల్లే ఇదంతా...) -
గవర్నర్‌పై పిటిషన్ వేస్తా..!
సాక్షి, చెన్నై: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం ఉండగా, ఆ ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటూ సమీక్షలు, సమాలోచనలు సాగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి వ్యాఖ్యానించారు. అందుకే గవర్నర్‌పై కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు శనివారం ప్రకటించారు. ఓ ప్రైవేటు కళాశాలలో అవినీతి వ్యతిరేక కమిటి సర్వోదయా మరు ముళక్కం నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సదస్సుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి హాజరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా విఫలమైందని, కేవలం ఎలాగైనా ఎన్నికలు పూర్తి చేయాలనే ముందుకు సాగారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అధికార పక్షం రూపంలో ఖూనీ చేసినా, ప్రజలు న్యాయమైన తీర్పునే ఇస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. డీఎంకే, లేదా దినకరన్‌కు విజయావకాశాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. జయలలిత మరణం మిస్టరీ తేల్చేందుకు విచారణ సాగుతున్న సమయంలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న వీడియో బయటకు రావడాన్ని తప్పు బట్ట లేమని వ్యాఖ్యానించారు. ఇలాంటి వీడియో ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఎప్పుడో విడుదల చేసి ఉండాలని పేర్కొన్నారు. రోడ్డు పక్కన బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధించాలని కోర్టులో తానే కేసు వేశానని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం వాటిలో జీవించి ఉన్న వారి ఫొటోలు పెట్టుకునే విధంగా అనుమతి వచ్చిందని, దీనిపై తగిన వివరాల్ని కోర్టుకు సమర్పిస్తానని, కొన్ని నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆ అధికారం గవర్నర్‌కు లేదు.. రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ఆయన సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అసలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే అధికారం గవర్నర్‌కు లేదని వ్యాఖ్యానించారు. జిల్లాల్లో అధికారులతో సమీక్షలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాల తీరు తెన్నుల మీద గవర్నర్ దృష్టి పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధంగా పేర్కొన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం పాలనలో ఉందన్న విషయాన్ని మరచి, గవర్నర్ ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. గవర్నర్ తన ధోరణి మార్చుకోని పక్షంలో త్వరలో ఆయన మీద కోర్టులో పిటిషన్ వేస్తానని ట్రాఫిక్ రామస్వామి హెచ్చరించడం గమనార్హం. -
ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు
-
ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏమైపోయారని.. నిజంగా వాళ్లు బందీలుగానే ఉన్నారా, ఎక్కడున్నా సోమవారానికల్లా అందరినీ తీసుకురావాలంటూ తమిళనాడు డీజీపీ టీకే రాజేంద్రన్‌ను మద్రాస్ హైకోర్టు సీరియస్‌గా ఆదేశించింది. ఎమ్మెల్యేలు బందీలు కావడంపై ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. దాంతో క్యాంపు రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడెక్కాయి. మహాబలిపురం గోల్డెన్ బే రిసార్టులలో ఉన్న ఎమ్మెల్యేలను తప్పనిసరిగా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఇదే పరిస్థితిపై గవర్నర్ విద్యాసాగర్ రావుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ టీకే రాజేంద్రన్ సమావేశమయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నిర్బంధం ఆరోపణలపై చర్చించారు. రాష్ట్రంలోని పరిస్థితులను సీఎస్, డీజీపీలు గవర్నర్‌కు వివరించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న క్యాంపు వద్దకు డీజీపీ స్వయంగా వెళ్లాలని నిర్ణయించారు. ఎక్కడా రిసార్టు.. ఎమ్మెల్యేలను నిర్బంధించినట్లు చెబుతున్న రిసార్టు ఒకరకంగా చెప్పాలంటే దుర్భేద్యమైనది. సముద్ర తీరానికి కిలోమీటరు దూరంలో సముద్రంలో ఒక చిన్న ద్వీపంలో ఈ రిసార్టు ఉంటుంది. దానికి చేరుకోవాలంటే తప్పనిసరిగా పడవల్లో వెళ్లాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అక్కడినుంచి తప్పించుకోవాలన్నా సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేల మానసిక స్థితి ఎలా ఉందోనని వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల ఫోన్లు లాక్కున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'సాక్షి' ప్రతినిధులు మంత్రి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే విజయకుమార్ తదితరులకు ఫోన్లు చేసే ప్రయత్నం చేసినప్పుడు స్విచాఫ్ అని వచ్చింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్లు కలిశాయి గానీ .. అప్పుడు వాళ్లు చాలా ఆందోళనకరమైన స్వరంతో మాట్లాడారు. రిసార్టులకు తాము ఇష్టపూర్వకంగా వెళ్లామా లేదా ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లడానికి వీల్లేకుండా తంజావూరు నుంచి వచ్చిన రౌడీ మూకలు కాపలా ఉన్నాయి. దాంతో మీడియా కూడా అక్కడకు వెళ్లే ధైర్యం చేయలేకపోతోంది. సుప్రీంలో శశికి ఊరట మరోవైపు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది అంత అత్యవసరమైనది కాదని, అందువల్ల సాధారణ పద్ధతిలోనే ఈనెల 17న దాన్ని విచారిస్తామని తెలిపింది. దాంతో శశికళకు ప్రమాణస్వీకారం అవకాశాలు కాస్త పెరిగినట్లయ్యాయి. సంబంధిత కథనాలు చదవండి.. శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
రాజకీయాల కోసం పిటిషన్లు వేయొద్దు : హైకోర్టు
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సీఎం ఆరోగ్యంపై గురువారం రెండో పిటిషన్‌ను వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. రెండు నిమిషాల్లోనే వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌ను ప్రచారం కోసం వేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యంగా కోర్టు పేర్కొంది. రాజకీయాల కోసం పిటిషన్లు వేయొద్దని హైకోర్టు హితవు పలికింది. జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేయాలంటూ ట్రాఫిక్ రామస్వామి గత సోమవారం ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
'అమ్మ' ఆరోగ్యంపై సమాచారం ఇవ్వండి!
⇒ సీఎం జయలలిత ఆరోగ్యంపై హైకోర్టు చెన్నై: తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య ప్రస్తుత పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు చెక్ పెట్టే విధంగా సమాచారం బహిర్గతం చేయాలని సూచించింది. తమిళనాడు సీఎం జయలలితకు చెన్నై అపోలో ఆస్పత్రిలో 13వ రోజులుగా వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన బులెటిన్‌లో ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో మద్రాసు హైకోర్టులో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఎఎం. సుందరేషన్, మహాదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. వదంతులకు చెక్ పెట్టే విధంగా సీఎం ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం లోపు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ప్రకటించాలని సూచించింది. -
జయలలిత హెల్త్ బులెటిన్ విడుదల
-
జయలలిత హెల్త్ బులెటిన్ విడుదల
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో వైద్యులు సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చికిత్సకు జయలలిత స్పందిస్తున్నారని, నిన్నటికంటే ఇవాళ ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం జయ ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తోందని అపోలో వైద్యులు ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. మరికొద్దిరోజులు ఆస్పత్రిలోనే ఆమె ఉంటారని వైద్యులు తెలిపారు. మరోవైపు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నా... అమ్మ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇక జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసేలా అపోలో వైద్యుల్ని ఆదేశించాలంటూ చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి ఇవాళ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. -
జయ ఆరోగ్యంపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్
-
జయ ఆరోగ్యంపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేయాలంటూ సోమవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జయ ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే అపోలో ఆస్పత్రి నివేదిక సమర్పించేలా ఆదేశాలివ్వాలంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు వాసులకు ట్రాఫిక్ రామస్వామి సుపరిచితమే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెలిసే బోర్డులు, ఫ్లెక్సీలు తదితర ప్రచార సాధనలను తొలగించడం ద్వారా రాష్ట్రంలో ఆయన బహుళ ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే జయలలిత ఆరోగ్యంపై వివరాలు తెలియటం లేదంటూ తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ఎవరూ బయటకు వెల్లడించడంలేదని న్యాయవాది రీగన్ ఎస్. బెల్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని, సీఎం ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. జ్వరంతో పాటు డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22న జయలలిత ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే మూడు, నాలుగు రోజులుగా ఆమె ఆరోగ్యంపై పెద్ద ఎత్తున వదంతులు ఏర్పడటంతో, అన్నాడీఎంకే కార్యకర్తలు,అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని, ఆమె కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని ఓ సీనియర్ జర్నలిస్ట్ ట్విట్ చేశారు. -
ట్రాఫిక్కా మజాకా !
అమ్మపై మళ్లీ దావా పిటిషన్‌ను వెనక్కు పంపిన కోర్టు సాక్షి, చెన్నై: అందరి మీద పరువు నష్టం దావాలు వేసే అన్నాడీఎంకే అధినేత్రి, అమ్మ జయలలిత మీదే దావాకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సిద్ధమయ్యారు. అయితే, ఆయన పిటిషన్‌ను కోర్టు వెనక్కు పంపడం గమనార్హం. సీఎం జయలలితకు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించినా, ఆధార రహిత ఆరోపణలు చేసినా కోర్టుల్లో పరువు నష్టం దావాలు దాఖలు కావాల్సిందే. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ న్యాయవాదులు ఉరకలు తీస్తుంటారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, దళపతి స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసులతో పాటుగా ఆ పార్టీలకు చెందిన పలువురు నేతలు, ఇంకా చెప్పాలంటే, అనేక పత్రికల సంపాదకులు, సామాజిక కార్యకర్తల మీద సైతం ఎన్నో దావాలు దాఖలై ఉన్నాయి. అందరి మీద దావాలు వేస్తూ ముందుకు సాగుతున్న అమ్మ జయలలిత మీద తాను దావా వేస్తానంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి రంగంలోకి దిగారు. సామాజిక కార్యకర్తగా ట్రాఫిక్ రామస్వామి తమిళనాట సుపరిచితుడే. ఆయన మీద కూడా ప్రభుత్వం తరఫున దావాలు దాఖలు చేసి ఉన్నాయి. తాజాగా, తన మీద అన్నాడీఎంకే పత్రిక నమదు ఎంజీయార్లో వచ్చిన ఓ కథనం ఆధారంగా ఆ పార్టీ అధినేత్రి జయలలిత, సంపాదకుడిపై పరువు నష్టం దావాకు ట్రాఫిక్ కసరత్తులు చేస్తూ ఉండడం విశేషం. గత నెల 23వ తేదీన జార్జ్ టౌన్ కోర్టులో పిటిషన్‌ను ఆయన దాఖలు చేసి ఉండటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పరువుకు భంగం కల్గించే విధంగా నమదు ఎంజీయార్లో కథనం వచ్చిందని, ఆ పత్రిక నిర్వాహకురాలైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, పత్రిక సంపాదకుడు పూంగుండన్ల మీద క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ కోర్టు పరిగణలోకి తీసుకోక పోవడం గమనార్హం. ఆ పిటిషన్‌కు తగ్గ ఆధారాలు లేవంటూ కోర్టు వెనక్కు పంపించింది. దీంతో గత పిటిషన్ తిరస్కరణ సమయంలో కోరినట్టుగా ఆధారాలు, వివరాల్ని పొందు పరిచి బుధవారం మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇందులో ఉన్న ఆధారాలు, వివరాలు, సమాచారాలు కూడా చాలవంటూ పిటిషన్‌ను జార్జ్ టౌన్ కోర్డు న్యాయమూర్తి వెనక్కు పంపించడం గమనించాల్సిన విషయం. అయితే, పట్టు వదలని విక్రమార్కుడి లా ఎలాగైనా పరువునష్టం దావా దాఖలు చేసి తీరడం, తన కేసులో జయలలితను కోర్టు మెట్లు ఎక్కించి తీరాలన్న లక్ష్యంతో ట్రాఫిక్ రామస్వామి పరుగులు తీస్తున్నారట. -
కెప్టెన్‌తో ట్రాఫిక్ భేటీ
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌తో మక్కల్ పాదుగాప్పు కళగం అధ్యక్షుడు ట్రాఫిక్ రామస్వామి గురువారం సమావేశమయ్యారు. చెన్నై కోయంబేడులోగల డీఎండీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరిగింది. వారిరువురూ సుమారు 50 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఇందులో కోశాధికారి ఏఆర్ ఇలంగోవన్, యువజన సంఘం కార్యదర్శి ఎల్కే సుధీష్, ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు. అనంతరం విలేకరులతో ట్రాఫిక్ రామస్వామి మాట్లాడుతూ డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆహ్వానం మేరకు ఆయన్ను కలుసుకున్నానని, తాను రూపొందించిన 14 అంశాల గురించి ఇందులో ప్రస్తావించానన్నారు. ఇందులో ప్రాథమిక జీవనాధార వసతులు, హద్దు మీరి ప్రవర్తించేవారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం, ఉచిత విద్య తదితర అంశాలను ఆయనకు సమర్పించానన్నారు. తన ప్రయత్నాలకు డీఎండీకే అధ్యక్షుడు వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎవరితో పొత్తులు కుదుర్చుకోవాలనే విషయంపై కూడా చర్చించామని, వచ్చే ఎన్నికల్లో అతిపెద్ద మార్పు ఏర్పడుతుందన్నారు. కాంచీపురం జిల్లాలో వచ్చే 20వ తేదీ జరిగే డీఎండీకే మహానాడు, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పును తీసుకురానుందన్నారు. -
అన్ని స్థానాల్లో పోటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు మక్కళ్ పాదుగాప్పు కళగం అధ్యక్షులు ‘ట్రాఫిక్’ రామస్వామి ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు తమ అభ్యర్దులు పోటీ పడతారని శనివారం ఆయన తెలిపారు.రాష్ట్రంలో సామాజిక సేవకుడు ట్రాఫిక్ రామస్వామి పేరును వినని వారుం డరు. పండితుడి నుంచి పామరుని వరకు. ఉన్నతాధికారి నుంచి బికారి వరకు ట్రాఫిక్ రామస్వామి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పరిచితుడే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారిపై కేసులు బనాయించడం, రోడ్లలో అడ్డదిడ్డంగా వెలిసే హోర్టింగులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం ద్వారా సాధారణ రామస్వామి ట్రాఫిక్ రామస్వామిగా పేరుగాంచాడు. తన సామాజిక కార్యక్రమాల కోసం ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంటాడు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల బ్యానర్లు ఆయన ఆగ్రహాన్ని చవిచూసినవే. రామస్వామి రోడ్లపై తిరుగుతుంటే ఎక్కడ ఏమి చేస్తాడో అనే భయంతో పోలీసులకు కునుకుండదు. ఇటీవల రామస్వామిపై కేసులు బనాయించి జైల్లో పెట్టిన పోలీసులు కోర్టు నుంచి అక్షింతలు తిన్నారు. ట్రాఫిక్ అడ్డుతొలగింపులో రామస్వామికి ఇటీవల కోర్టు సానుభూతి సైతం లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రామస్వామి పేరు మార్మోగి పోయింది. ఎన్నికలకు సన్నద్ధం: మక్కళ్ పాదుగాప్పు కళగం (ప్రజా సంరక్షణ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న ‘ట్రాఫిక్’ రామస్వామి ఈ పేరుతోనే సామాజిక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశ్యం ఆయనకు లేదు. అయితే గత ఏడాది అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించడంతో అధికార పార్టీ నేతల అగ్రహానికి గురైనారు. తప్పుడు కేసు బనాయించి జైల్లోకి నెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలతో అన్నాడీఎంకేపై కసిపెంచుకున్న రామస్వామి ప్రతిపక్ష పార్టీలకు చేరువైనాడు. ఇటీవలి అర్కేనగర్ ఎన్నికల్లో రామస్వామి పోటీచేశాడు. ఇందుకు కొనసాగింపుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం 234 స్థానాలకు తమ పార్టీ తరపున సామాజిక సేవాభిలాషులు పోటీలో నిలుస్తారని చెప్పారు. కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్ మద్దతునిస్తే వారితో కలిసి నడిచేందుకు సిద్ధమేనని ట్రాఫిక్ రామస్వామి తెలిపారు. -
ఏకగ్రీవానికి ‘ట్రాఫిక్’ అడ్డు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు వాసులకు ట్రాఫిక్ రామస్వామి సుపరిచితమే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెలిసే బోర్డులు, ఫ్లెక్సీలు తదితర ప్రచార సాధనలను తొలగిం చడం ద్వారా రాష్ట్రంలో ఆయన బహుళ ప్రాచుర్యం పొందారు. అమ్మ ఫ్లెక్సీలను సైతం నిర్దాక్షణంగా తొలగించిన నేపథ్యంలో ఇటీవల ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కోర్టు సైతం రామస్వామికి అనుకూలంగా వ్యాఖ్యానించడమేగాక పోలీసుశాఖపై అక్షింతలు వేసింది. బెయిల్‌పై బయటకు వచ్చిన రామస్వామి వచ్చీరాగానే మళ్లీ రోడ్లపైకి చేరుకుని ఫ్లెక్సీల తొలగింపులో నిమగ్నమయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఆయన చేసే సామాజిక సేవకు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నందున పోలీసులు పలుమార్లు ఇరుకున పడుతున్నారు. ఈ రకంగా 82 ఏళ్ల వృద్ధుడైన రామస్వామి ప్రజలకు సుపరిచితుడుగా మెలుగుతున్నారు. విపక్షాల సభ్యుడిని నేనే: రామస్వామి ఆర్కేనగర్ నుంచి పోటీచేసేందుకు విపక్షాలన్నీ వెనకడుగు వేస్తున్న తరుణంలో వారందరి ఉమ్మడి అభ్యర్థిగా తాను రంగంలోకి దిగుతున్నట్లు మక్కల్ పాదుగాప్పు కళగం అధ్యక్షులు, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి గురువారం ప్రకటించారు. టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే అగ్రనేత డాక్టర్ రాందాస్, ఎండీఎంకే అధినేత వైగో తదితరులను కలిసి మద్దతు కోరనున్నట్లు ఆయన చెప్పారు. జయకు జైలు శిక్షతో ఖాళీ అయిన తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం నియోజకవర్గంలో ఈఏడాది ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన ఉప ఎన్నికలలో సైతం రామస్వామి పోటీ చేశారు. ఆ ఎన్నికలో 1167 ఓట్లు సాధించి ఓటమిపాలయ్యారు. 3న కాంగ్రెస్, సీపీఎంల సమావేశం: ఆర్కేనగర్లో పోటీపై నిర్ణయం తీసుకునేందుకు వచ్చేనెల 3వ తేదీన టీఎన్‌సీసీ సమావేశం అవుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ ఈ సమావేశంలో పాల్గొని రాష్ట నేతల సమక్షంలో నిర్ణయం తీసుకుంటారు. అలాగే సీపీఎం సైతం ఆర్కేనగర్లో పోటీపై 3వ తేదీన సమావేశం కానుంది. ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. ప్రధాన పార్టీలన్నీ పోటీకి సుముఖంగా లేని తరుణంలో అమ్మ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ ఆశించారు. అయితే ఎవరేమన్నా ట్రాఫిక్ రామస్వామి పోటీ నుండి తప్పుకునే అవకాశం లేదు. ఈ కారణంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికలో జయకు ఏకైక ప్రత్యర్థిగా ట్రాఫిక్ రామస్వామి మరో గుర్తింపును దక్కించుకోనున్నారు. -
బదిలీ వేటు
సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి అరెస్ట్ వ్యవహారంలో దుందుడుకుగా వ్యవహరించిన పోలీస్ అధికారిపై ఎట్టకేలకూ వేటు పడింది. సంబంధిత ఇన్స్పెక్టర్ ప్రభును తిరువేర్కాడు క్రైం బ్రాంచ్‌కి బదిలీచేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:పోయస్‌గార్డెన్, సచివాలయం సమీపంలో జయలలిత ఫ్లెక్సీలతోపాటూ పురసవాక్కం రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అనేక బ్యానర్లను ట్రాఫిక్ రామస్వామి ఇటీవల తొలగించారు. వీరమణి అనే పారిశ్రామిక వేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై వేప్పేరీ పోలీస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ప్రభు రామస్వామిని తెల్లవారుజాము 3.45గంటలకు అరెస్ట్ చేసి, మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలిం చారు. ఇదే సమయంలో ఒక డీఎంకే నేత తమ సమావేశానికి బ్యానర్లు కట్టుకునేందుకు అనుమతించాల్సిందిగా పోలీసుశాఖకు దరఖాస్తు చేసుకోగా తిరస్కరించింది. డీఎంకే నేత కోర్టును ఆశ్రయించగా, బ్యానర్లను అదుపుచేసేందుకే నిరాకరించామని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో సమర్థించుకున్నారు. అధికార పార్టీ దరఖాస్తు చేసుకున్నా ఇలాగే నిరాకరిస్తారా అంటూ కోర్టు నిలదీసింది. ట్రాఫిక్ రామస్వామి అరెస్ట్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించి పోలీస్ చర్యను కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నగర పౌరులకు ఇబ్బందులు కలిగే బ్యానర్లను అధికారులు అడ్డుకోరు, అడ్డుకునేవారిని జైళ్లలోకి నెట్టుతారని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ముందురోజు కేసు నమోదు చేసి పక్కరోజు తెల్లవారుజామున ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అయనేమైనా తీవ్రవాదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో సంబంధిత ఇన్స్పెక్టర్ ప్రభును తిరువేర్కాడు క్రైంబ్రాంచ్‌కు బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి సోమవారం రాత్రి ఆకస్మికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. రామస్వామికి బెయిల్ చంపుతానని బెదిరించాడంటూ పారిశ్రామికవేత్త వీరమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్‌యిన ట్రాఫిక్ రామస్వామికి ఎగ్మూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రామస్వామికి ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి, ఆ తరువాత మెరుగైన చికిత్సకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ మంజూరు చేయాలని రామస్వామి పిటిషన్ పెట్టుకున్నారు. వారానికి ఒకసారి కోర్టుకు హాజరై సంతకం పెట్టేలా షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. -
‘ట్రాఫిక్’ అరెస్ట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: సామాజిక కార్యకర్త, ట్రాఫిక్ రామస్వామిని పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. చెన్నై నగరం లో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగులపై ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తి చేతులకు ఎట్టకేలకూ సంకెళ్లు వేశారు. నగరంలో విచ్చలవిడిగా వెలిసే ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులను సామాజిక సేవా కార్యకర్త రామస్వామి ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ అనేది ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై రామస్వామి పెట్టిన అనేక కేసులు మద్రాసు హైకోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులను నిలదీసే ధైర్యంలేక సర్దుకుపోతున్న ప్రజలకు 70 ఏళ్ల ట్రాఫిక్ రామస్వామి అభిమాన పాత్రుడయ్యాడు. ఎన్నో ఏళ్లుగా రామస్వామి తనదైన శైలిలో పోరాడుతూనే ఉండగా, ప్రజాశ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని ఎవ్వరూ అడ్డుకునే సాహసం చేయలేక పోయారు. జయ ఫ్లెక్సీలు చింపివేత ట్రాఫిక్ రామస్వామి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫ్లెక్సీలను తానే స్వయంగా చించివేశారు. ఆ తరువాత అన్నా ఫ్లైఓవర్, అన్నాసాలై దర్గా సమీపంలోని బ్యానర్లను చించారు. సచివాలయం సమీపంలో జయకు శుభాకాంక్షలు తెలుపుతూ అమర్చిన బ్యానర్లను తొలగించనుండగా పోలీసులు అడ్డుకుని పంపివేశారు. బుధవారం సాయంత్రం వేప్పేరి పరిసరాల్లోని రోడ్లలోని కట్అవుట్, బ్యానర్లను తొలగిస్తుండగా ఆ మార్గంలో కారులో వస్తున్న హోటల్ యజమాని వీరమణి పక్కకు తప్పుకోవాలని రామస్వామిని కోరారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో కోపగించుకున్న వీరమణి వేప్పేరీ పోలీసులకు రామస్వామిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బుధవారం రాత్రి ట్రాఫిక్ రామస్వామి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల ధ్వంసం, చట్టవిరుద్ధంగా వ్యవహరించడం, హత్యా బెదిరింపులు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం రామస్వామిని ఎగ్మూరు కోర్టులో ప్రవేశపెట్టి పుళల్‌జైలుకు తరలించారు. -
కోర్టు కొరడా
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ), చెన్నై కార్పొరేషన్లపై మద్రాసు హైకోర్టు కొరడా ఝుళిపించింది. జార్జ్‌టౌన్ పరిధిలోని 11,302 ఆక్రమిత, అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నగర పరిధిలోని జార్జ్‌టౌన్‌లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరిగాయని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేశాడు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు సాగాయని, ఇరుకు సందుల్లో ఆకాశహర్మ్యాలు నిర్మించారని ఆయన ఆరోపించారు. ఇటీవల జార్జ్‌టౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించగా అగ్నిమాపక శకటం సందులోకి వెళ్లలేకపోయిందని, ఈ కారణంగా ఓ వ్యక్తి మృతిచెందగా భారీ ఆస్తినష్టం సంభవించిందని పిల్లో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణల ముందుకు ఈ పిల్ శుక్రవారం విచారణకు వ చ్చింది. జార్జ్‌టౌన్‌లో 479 వీధులుండగా 300 వీధులను తనిఖీ చేసి 3,080 నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు గుర్తించామని సీఎండీఏ అధికారి కార్తిక్ కోర్టుకు వివరించారు. ఆ నిర్మాణాలను స్వచ్ఛందంగా సరిచేసుకోవాలని యజమానులకు నోటీసులు పంపామని, ఆపై చర్యలకు ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి ఉన్నామని వివరించారు. కార్పొరేషన్ కమిషనర్ విక్రమ్ ప్రభు ఒక లేఖ ద్వారా కోర్టుకు వివరణ పంపారు. జార్జ్‌టౌన్‌లో 14,450 నిర్మాణాలకు గాను 11,304 నిర్మాణాలను తనిఖీ చేయగా వీటిల్లో 6,183 నిర్మాణాలు రోడ్డు ఆక్రమించుకున్నట్లు, మరికొన్ని నిబంధనలను ధిక్కరించి నిర్మించినట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం నిర్మాణాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే సక్రమంగా ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సోమయాజీ బదులిస్తూ ఒక్క శాతం మాత్రమే నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని అన్నారు. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా హద్దుమీరిన నిర్మాణాలకు నోటీసులు జారీచేయగా కొందరు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మరికొందరు ప్రభుత్వానికి మొరపెట్టుకోవడంతో స్తంభన ఏర్పడిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు... ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాల సమస్యను ఎలా అధిగమిస్తారో నాలుగు వారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్పొరేషన్లో సిబ్బంది, అధికారుల కొరత కారణంగా నిర్మాణాలపై పర్యవేక్షణ లోపించిందని మరో వాదన ఉన్నందున ఈ అంశంపైనా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
‘సహాయం’కుగ్రీన్ సిగ్నల్
గ్రానైట్ అక్రమ దందాపై సమగ్ర విచారణకు ఐఏఎస్ అధికారి సహాయం కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారణను మదురై జిల్లాకు మాత్రమే పరిమితం చేసినట్లు సంకేతాలు వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ రామస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసుకు పట్టుబడుతూ పిటిషన్ దాఖలు చేశారు. సాక్షి, చెన్నై:రాష్ట్రంలో గ్రానైట్, సముద్ర తీరాల్లో ఖనిజ సంపదల్ని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న బడా బాబుల బండారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కేవలం మదురైలోనే వేల కోట్ల కుంభకోణం బయటపడడంపై మద్రాసు హైకోర్టు రాష్ర్ట వ్యాప్తంగా సమగ్ర విచారణకు ఆదేశించింది. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలో కమిటీని హైకోర్టు ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయలేదు. ఇప్పటికే తాము అన్ని చర్యలు తీసుకున్నామంటూ ఆ కమిటీని వ్యతిరేకించే పనిలో పడింది. ఎట్టకేలకు గత వారం హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో కమిటీ ఏర్పాటు అనివార్యం అయింది. ఆమోదం : నాలుగు రోజుల్లోపు కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ గత వారం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆ గ డువు ముగిసినా ఉత్తర్వులు వెలువడ లేదు. దీంతో కోర్టు ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సహాయం కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని గురువారం ప్రధాన బెంచ్ ముందు ఉంచారు. సహాయం కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు, ఆ కమిటీకి ప్రభుత్వం అందించే సహాయాన్ని వివరిస్తూ తన వాదనను బెంచ్ ముందు ప్రభుత్వం తరపు న్యాయవాది సోమయాజులు ఉంచారు. మదురైకు పరిమితం: సహాయం కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ర్ట ప్రభుత్వం తన పనితనాన్ని ప్రదర్శిస్తూ మెలిక విధించడం చర్చనీయాంశమైంది. కేవలం మదురైలో సాగిన గ్రానైట్ స్కాంపై సమగ్ర విచారణ జరిపే విధంగా ఆ కమిటీకి అధికారాల్ని ప్రభుత్వం ఇచ్చినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ వాదనల సందర్భంగా ట్రాఫిక్ రామస్వామి తరపు న్యాయవాది రాజారాం బెంచ్ ముందుకు కొన్ని విషయాల్ని తీసుకెళ్లారు. కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు వచ్చిన దృష్ట్యా, అందులో ఉన్న అంశాల్ని పరిగణనలోకి తీసుకుని తదుపరి పిటిషన్‌కు బెంచ్ అవకాశం కల్పించింది. దీంతో కోర్టు ధిక్కార కేసు నమోదు లక్ష్యంగా ట్రాఫిక్ రామస్వామి బెంచ్‌ముందు పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోకుండా, కేవలం మదురైకు పరిమితం చేస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే, కాలయాపన, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎంకే నేత రాందాసు తన ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని వ్యతిరేకించారు. కోరల్ని పీకేసి కమిటీని ఏర్పాటు చేసినట్టుందని మండి పడ్డారు. కేవలం మదురైకు పరిమితం చేయకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సహాయం నేతృత్వంలోని కమిటీకి విచారణ జరిపే అధికారాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. -
ట్రాఫిక్ రామస్వామి... మజాకా!
సీఎం జయలలిత ఫ్లెక్సీలను చూసి, సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. పోలీసులతో ఢీ కొట్టారు. వారితో వాగ్యుద్ధానికి దిగారు. చివరకు ట్రాఫిక్ రామస్వామికి అధికారులు తలొగ్గక తప్పలేదు. వారు కూడా ఫ్లెక్సీలను తొలగించాల్సి వచ్చింది. చెన్నై : చెన్నై మహా నగరవాసులకు ట్రాఫిక్ రామస్వా మి సుపరిచితుడు. జనంతో మమేకమై. జనం కోసం... వారి హక్కులను ఇంటి వద్దకే చేర్చటం కోసం ప్రభుత్వాలను, బడా వ్యాపారవేత్తలను, సమాజాన్ని నిలదీ స్తూ, సామాజిక బాధ్యతలను అందరికీ విశదీకరిస్తున్న ఓ సామాన్యుడే ఈ ట్రాఫిక్ రామస్వామి. 79 ఏళ్ల వయస్సులోనూ అలుపెరుగని యోధుడిలా ప్రజా హక్కు ల కోసం కోర్టుల్లో ఉద్యమిస్తూ వస్తున్నా రు. నగరంలో ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థ ప్రస్తుతం గాడిలో పడిందంటే ఆయన ప్రాత ఎంతో ఉం ది. ఇటీవల నగరంలో విచ్చలవిడిగా, ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్న ఫ్లెక్సీలు, రాజకీయ బ్యానర్లపై రామస్వామి దృష్టి పెట్టారు. కోర్టులో పిటిషన్ వేసి పెద్ద సమరమే చేశారు. ఎట్టకేలకు నగరంలో బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు ఆంక్షలు, అనుమతులు తప్పనిసరి అయ్యాయి. ఆగ్రహం: పోయేస్ గార్డెన్ మార్గంలో సీఎం జయలలిత దృష్టిలో పడే విధంగా అన్నాడీఎంకే నాయకులు తరచూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఈ మార్గంలో ఇష్టారాజ్యంగా వెలసి ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లపై ట్రాఫిక్ రామస్వామి దృష్టి పడింది. ఆగ్రహానికి లోనైన ఆయన శనివారం స్వయంగా రంగంలోకి దిగారు. అక్కడున్న ఓ ఫెక్సీని చించేశారు. దీన్ని గుర్తించిన అక్కడి భద్రతా సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగిస్తారా..? తొలగించమంటారా..? అంటూ పోలీసులతో ఢీ కొట్టారు. వాగ్యుద్ధం: ఆగ్రహంతో బ్యానర్లను తొలగించేందుకు దిగిన ట్రాఫిక్ రామస్వామిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆయన అందుకున్నారు. బ్యానర్ల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాల్సి ఉందని, ఏర్పాటు చేసిన నిర్ణీత కాల వ్యవధిలో తొలగించాల్సి ఉందని వివరించారు. అయితే, ఇక్కడున్న బ్యానర్లు, ఫెక్సీలు ఎప్పుడు ఏర్పాటు చేశారో, దీన్ని తొలగించేందుకు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారో తనకు తెలుసునని, కోర్టులో తేల్చుకుంటానంటూ గదమాయిండం తో పోలీసులు వెనక్కు తగ్గారు. దీంతో ముందుకు కదిలిన రామాస్వామి అక్కడున్న మరో రెండు ఫ్లెక్సీల్ని చించిపడేశారు. చివరకు అధికారులు రామస్వామికి హెచ్చరికకు తలొగ్గాల్సి వచ్చింది. అక్కడ రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాటిని తొలగించారు. అన్నీ తొలగించి నా, రామస్వామిలో మాత్రం ఆగ్రహం చల్లార లేదు. కోర్టులో తేల్చుకుంటానంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు.