
జయలలిత హెల్త్ బులెటిన్ విడుదల
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ‍్యంపై అపోలో వైద్యులు సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చికిత్సకు జయలలిత స్పందిస్తున్నారని, నిన్నటికంటే ఇవాళ ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం జయ ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తోందని అపోలో వైద్యులు ఆ బులెటిన్లో పేర్కొన్నారు.
మరికొద్దిరోజులు ఆస్పత్రిలోనే ఆమె ఉంటారని వైద్యులు తెలిపారు. మరోవైపు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నా... అమ్మ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇక జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసేలా అపోలో వైద్యుల్ని ఆదేశించాలంటూ చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి ఇవాళ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.