రాజకీయాల కోసం పిటిషన్లు వేయొద్దు : హైకోర్టు | Madras High Court rejection of traffic ramaswamy petition over Jayalalitha health | Sakshi
Sakshi News home page

రాజకీయాల కోసం పిటిషన్లు వేయొద్దు : హైకోర్టు

Published Thu, Oct 6 2016 11:49 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

రాజకీయాల కోసం పిటిషన్లు వేయొద్దు : హైకోర్టు - Sakshi

రాజకీయాల కోసం పిటిషన్లు వేయొద్దు : హైకోర్టు

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సీఎం ఆరోగ్యంపై గురువారం రెండో పిటిషన్ను వేశారు. 
 
దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. రెండు నిమిషాల్లోనే వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ను ప్రచారం కోసం వేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యంగా కోర్టు పేర్కొంది. రాజకీయాల కోసం పిటిషన్లు వేయొద్దని హైకోర్టు హితవు పలికింది. జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేయాలంటూ ట్రాఫిక్ రామస్వామి గత సోమవారం ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement