పక్కా ప్లాన్తోనే రైలు దోపిడీ | train robbery made with perfect plan | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్తోనే రైలు దోపిడీ

Published Tue, Apr 1 2014 11:42 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

పక్కా ప్లాన్తోనే రైలు దోపిడీ - Sakshi

పక్కా ప్లాన్తోనే రైలు దోపిడీ

చెన్నై ఎక్స్ప్రెస్ అనగానే షారుక్ ఖాన్, దీపికా పడుకొనే నటించిన సినిమాయే గుర్తుకొస్తుంది. కానీ, ఇప్పుడు మాత్రం చెన్నై ఎక్స్ప్రెస్ అంటే చాలు.. అర్ధరాత్రి జరిగిన దోపిడీ గుర్తుకొస్తుంది. పక్కా మాస్టర్ ప్లాన్తో ఈ దోపిడీకి పాల్పడ్డారు. ముందుగా రెక్కీ చేసుకుని మరీ అత్యంత పకడ్బందీగా తమ పని కానించుకున్నారు. సరిగ్గా ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో, అది కూడా రైల్వే పోలీసులు దిగిపోయిన తర్వాత  ప్రయాణికులపై విరుచుకు పడ్డారు. కత్తులతో బెదిరించి చిన్నాపెద్దా వస్తువులను కాజేశారు. వరుసగా ఎస్-1 నుంచి ఎస్-12 వరకు ఉన్న బోగీల్లో నగలు, నగదు, సెల్‌ఫోన్లు, ఐప్యాడ్లు, పర్సులు ఇలా చేతికి చిక్కిందల్లా సొంతం చేసుకున్నారు.

వేకువజామున రెండున్నర గంటల ప్రాంతంలో గుంటూరుజిల్లా పిడుగురాళ్లకు రైలు చేరుకోగా ... చెన్నాయపాలెం 71 గేటు వద్ద చైను లాగి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే దోపిడీ తర్వాత ఎస్-11 బోగీలోని సీట్ నెంబర్ 24 ప్రయాణికుడు అదృశ్యం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలు ఎక్కినప్పటి నుంచి అతడి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని కొందరు ప్రయాణికులు అంటున్నారు. చోరి జరిగాక, సదరు ప్రయాణికుడు అదృశ్యమవ్వడంతో .. అతడే తెరవెనక కథ నడిపాడేమోనని సందేహిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల దృష్ట్యా తగినంతమంది సిబ్బంది లేకపోవడం, బీట్ కానిస్టేబుల్స్‌ బీట్ మారడం తదితర అంశాలను దొంగలు అవకాశంగా తీసుకుని ఉంటారని రైల్వే ఎస్పీ భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement