Chennai-hyderabad express
-
పక్కా ప్లాన్‌తోనే రైలు దోపిడీ
-
పక్కా ప్లాన్‌తోనే రైలు దోపిడీ
చెన్నై ఎక్స్‌ప్రెస్ అనగానే షారుక్ ఖాన్, దీపికా పడుకొనే నటించిన సినిమాయే గుర్తుకొస్తుంది. కానీ, ఇప్పుడు మాత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్ అంటే చాలు.. అర్ధరాత్రి జరిగిన దోపిడీ గుర్తుకొస్తుంది. పక్కా మాస్టర్ ప్లాన్‌తో ఈ దోపిడీకి పాల్పడ్డారు. ముందుగా రెక్కీ చేసుకుని మరీ అత్యంత పకడ్బందీగా తమ పని కానించుకున్నారు. సరిగ్గా ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో, అది కూడా రైల్వే పోలీసులు దిగిపోయిన తర్వాత ప్రయాణికులపై విరుచుకు పడ్డారు. కత్తులతో బెదిరించి చిన్నాపెద్దా వస్తువులను కాజేశారు. వరుసగా ఎస్-1 నుంచి ఎస్-12 వరకు ఉన్న బోగీల్లో నగలు, నగదు, సెల్ఫోన్లు, ఐప్యాడ్లు, పర్సులు ఇలా చేతికి చిక్కిందల్లా సొంతం చేసుకున్నారు. వేకువజామున రెండున్నర గంటల ప్రాంతంలో గుంటూరుజిల్లా పిడుగురాళ్లకు రైలు చేరుకోగా ... చెన్నాయపాలెం 71 గేటు వద్ద చైను లాగి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే దోపిడీ తర్వాత ఎస్-11 బోగీలోని సీట్ నెంబర్ 24 ప్రయాణికుడు అదృశ్యం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలు ఎక్కినప్పటి నుంచి అతడి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని కొందరు ప్రయాణికులు అంటున్నారు. చోరి జరిగాక, సదరు ప్రయాణికుడు అదృశ్యమవ్వడంతో .. అతడే తెరవెనక కథ నడిపాడేమోనని సందేహిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల దృష్ట్యా తగినంతమంది సిబ్బంది లేకపోవడం, బీట్ కానిస్టేబుల్స్ బీట్ మారడం తదితర అంశాలను దొంగలు అవకాశంగా తీసుకుని ఉంటారని రైల్వే ఎస్పీ భావిస్తున్నారు. -
ప్రయాణికుడి అదృశ్యంపై అనుమానాలు
హైదరాబాద్ : చెన్నై-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ దోపిడీ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దోపిడీ అనంతరం ఎస్-11 కోచ్‌లోని 24 నెంబరు సీటు ప్రయాణికుడు అదృశ్యమయ్యాడు. దాంతో పోలీసులు అతడి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్క పథకం ప్రకారమే ఈ దోడిపీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అదృశ్యమైన ప్రయాణికుడి వివరాలుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దోపిడీలో పదిమంది పాల్గొన్నట్లు సమాచారం. వీరంతా యువకులే కాగా ముఖాలకు మాస్క్ లు ధరించి దోపీడి చేశారు. కాగా ఈ దోపిడీ ఘటనపై తొమ్మిది మంది ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. -
రైలు దోపిడీపై ప్రయాణికుల ఫిర్యాదు
హైదరాబాద్ : చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు దోడిపీపై ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇకనైనా రైళ్లల్లో భద్రత పెంచాలని వారు డిమాండ్ చేశారు. కాగా అసలే అర్థరాత్రి రెండున్నర .. రైల్లో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. అంతే ఒక్కసారిగా దొంగలు విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా నడికుడి వద్ద చెన్నై హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు చైను లాగి మరీ బీభత్సం సృష్టించారు. S-11, S-12 బోగీల ప్రయాణికులను బెదిరించి నగలు, నగదు దోచుకున్నారు. వ్యూహం ప్రకారం రెక్కి నిర్వహించిన దొంగలు, పిడుగురాళ్లలో జీఆర్పీ పోలీసులు దిగిపోయిన కాసేపటికే రంగంలోకి దిగారు. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. కత్తులతో బెదిరించిన దొంగలు, దాదాపు అందరి దగ్గర ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. సెక్యూరిటీ గార్డు లేకపోవడం, రైళ్లల్లో భద్రత కరువవ్వడమే చోరీకి కారణమని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి వెళ్లగా టిసి సహకరించలేదని, కనీసం రైల్వే హెల్ప్‌లైన్ కూడా పనిచేయలేదని వారు ధ్వజమెత్తారు. -
రైలు దోపిడీపై ప్రయాణికుల ఫిర్యాదు
-
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం
-
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం
గుంటూరు: దొంగల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. రైళ్లో దూరప్రయాణాలు చేసే ప్రయాణికులపై రాత్రివేళల్లో దాడులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని నడికూడి వద్ద అర్థరాత్రి చెన్నై - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో దోపీడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్లోకి ప్రవేశించిన దొంగలు ఏసీ, స్లీపర్ కోచ్ s11,s12 బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బెదిరించి డబ్బులు, నగలు దోచుకున్నట్టు రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన రాత్రి 2:30 గంటల మధ్య చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా రైల్లోకి ప్రవేశించిన దొంగలు పిడుగురాళ్ల చెన్నైపాలెం గేటు వద్ద చైన్‌లాగి దోపీడీకి యత్నించినట్టు తెలుస్తోంది. దొంగల బీభత్సానికి ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురైయ్యారు. దొంగల దోపీడీతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.