
సాక్షి, అమరావతి: నిష్ఠా కార్యక్రమం ద్వారా లక్షా యాభైవేల మంది ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్సీఈఆర్టీకి రాష్ట్రం తరఫున సంపూర్ణ సహకారం అందజేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
► కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 1200 మంది కీ రిసోర్సు పర్సన్లకు నిష్ఠా (నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్ వెబినార్ ద్వారా ప్రారంభించింది.
► కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ అమలు చేస్తోన్న ‘అమ్మ ఒడి, మనబడి: నాడు–నేడు’, ఆంగ్లమాధ్యమ ఆవశ్యకత, జగనన్న గోరుముద్ద’ తదితర అంశాలతో పాటు ‘జగనన్న విద్యాకానుక’ గురించి వివరించారు.
► ప్రాథమిక స్థాయిలో అందరు ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల అధిపతులు, రాష్ట్ర పరిశోధనా శిక్షణా సంస్థల అధ్యాపకులు, డైట్లతో పాటు మండల వనరుల కేంద్రం, సముదాయ వనరుల కేంద్రాల నుంచి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇవ్వడం నిష్ఠా లక్ష్యమని అన్నారు. పలువురు కేంద్ర రాష్ట్రప్రభుత్వా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment