బదిలీల బాగోతం | Transformations bagotam | Sakshi
Sakshi News home page

బదిలీల బాగోతం

Published Thu, Nov 20 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

బదిలీల బాగోతం

బదిలీల బాగోతం

నెల్లూరు(రెవెన్యూ): రెవెన్యూ శాఖలో బదిలీల బాగోతం నడుస్తోంది. అధికారపార్టీ నాయకులు సూచించిన ఉద్యోగులకు కోరుకున్న చోటకు బదిలీలు జరిగిపోతున్నాయి. గత నెలలో బదిలీ అయిన డిప్యూటీ తహశీల్దార్లు ఆ కుర్చీలు నచ్చక.. పదిరోజులు తిరగకుండానే కోరుకున్న చోటకు పోస్టింగ్ వేయించుకున్నారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చి వారికి కావలసిన ప్రాంతాలను దక్కించుకున్నారు.

ఈ నెల 18వ తేదీ రాత్రి టీడీపీ నాయకులు జిల్లా అధికారుల వద్ద బైటాయించి వారికి కావాల్సిన ఉద్యోగులను కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయించారు. ఈ నెల 15వ తేదీతో బదిలీ ప్రక్రియ పూర్తికావలసి ఉంది. ప్రభుత్వం మరో పర్యాయం బదిలీ గడువును వారంరోజులు పెంచింది. ఈ నెల 22వ తేదీతో బదిలీల ప్రక్రియ పూర్తికానుంది. జిల్లాలో ఈ నెల మొదటివారంలో టీడీపీ నాయకులు సిఫార్సు మేరకు 24 మంది డీటీలను బదిలీలు చేశారు.

బదిలీలు చేసి 10 రోజులు నెల్లూరు(క్రైమ్) : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రిమాండ్ ఖైదీ ఎ.ఏలుమలై (23) మృతదేహానికి బుధవారం ప్రభుత్వాస్పత్రిలో నెల్లూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తమిళనాడు రాష్ట్రం విల్లిపురం జిల్లా చినసేలం తాలూకా మెల్లత్‌ఖుజీల్లీ గ్రామానికి చెందిన ఆండి, చిన్నపొన్ను దంపతుల కుమారుడు ఏలుమలై ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. బోరుమెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతనికి నాలుగేళ్ల కిందట ధర్మపురికి చెందిన ఇంద్రాణితో వివాహమైది. వారికి మూడేళ్ల పాప ఉంది. ఎంతో సంతోషంగా సాగే ఆ కుటుంబంలో ఓ ఘటన విషాదం నింపింది.   

  గతేడాది డిసెంబర్‌లో శేషాచలం అడవుల్లో  ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఇద్దరు అటవీ అధికారులను హతమార్చిన విషయం విధితమే. దీంతో ప్రత్యేక పోలీసులు బలగాలు శేషాచలం అడవుల్లో జల్లెడ పట్టాయి. కనిపించిన వారందరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. వారిలో ఏలుమలై ఒకడు. గతేడాది డిసెంబర్ 20వ తేదీ నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో 238 మంది ఎర్ర కూలీలు రిమాండ్ అనుభవిస్తున్నారు.

వీరంతా తమిళనాడు వాసులు. రిమాండ్‌కు తరలించిన కొద్ది రోజులకు ఏలుమలై నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నాడని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తల్లిదండ్రులు పలుమార్లు కుమారుడిని చూసేందుకు నెల్లూరుకు వచ్చి వెళ్లారు.

అయితే ఏలుమలై జైలులో ఉన్నాడని తెలియగానే భార్య తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. 10 రోజుల కిందట ఆండి, చిన్నపొన్ను జిల్లా కేంద్ర కారాగారానికి వచ్చారు. కుమారుడితో మాట్లాడి వెళ్లారు. మంగళవారం ఏలుమలై తీవ్ర అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు.

 అనారోగ్యంతో మృతి
 ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన జ్వరం రావడంతో జైలులోనే వైద్యులు చికిత్స చేశారు. మళ్లీ ఈ నెల 17వ తేదీ ఉదయం ఉన్నట్లుండి కాళ్లు, చేతులు వాపుతో పాటు విపరీతంగా నొప్పులు వచ్చాయి. అతనికి వైద్యులు  పరీక్షలు చేసి చికిత్స అందించారు.

18వ తేదీ ఉదయం శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో జైలు వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం డీఎస్‌ఆర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో జైలు అధికారులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే ఆయన మృతి చెందాడు. కుమారుని మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని బాధిత తల్లిదండ్రులు ఆర్డీఓకు తెలిపారు.  

 జైలు అధికారుల నిర్లక్ష్యమే
 జైలు అధికారుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాడని బాధిత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఏలుమలై మృతి చెందాడని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, అతని మామ కె. విక్టరీకొండన్, చిన్నాన్న కేతమలైలు బుధవారం ఉదయం నెల్లూరుకు చేరుకున్నారు.

వారి సమక్షంలోనే ఆర్డీఓ శవపంచనామా నిర్వహించారు. తాము పది రోజుల కిందట నెల్లూరు జైలుకు వచ్చామన్నారు. భోజనం సరిగా ఉండటం లేదని, అది తినడం వల్ల తరచూ అనారోగ్యం వస్తోందని తమ కుమారుడు తెలిపాడని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. సకాలంలోనే  ఆస్పత్రికి తీసుకువచ్చి ఉంటే తన కుమారుడు బతికి ఉండేవాడని వారు వాపోయారు.  

 మెజిస్టీరియల్ విచారణ జరపాలి : ఎల్లంకి వెంకటేశ్వర్లు, ఏపీ పౌరహక్కుల సంఘం
 నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల ఖైదీలు అనారోగ్యం పాలవుతున్నారు. వారికి సరైన వైద్య సేవలందించడంలో జైలు అధికారుల నిర్లక్ష్య ధోరణి స్పష్టమవుతోంది. పరిస్థితి విషమించే అంత వరకు జైలులోనే ఉంచి ఆపై ఆస్పత్రికి పంపుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన కొద్ది సేపటికే ఖైదీలు మృతి చెందుతున్నారు.  ఖైదీల మృతిపై మెజిస్టీరియల్ విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు.

 ఏలుమలై మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
 నెల్లూరు (వైద్యం) : తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ఏలుమలై మృతదేహానికి బుధవారం డీఎస్‌ఆర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శశికాంత్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మృతి చెందిన రిమాండ్ ఖైదీ కిడ్నీ, లివర్‌లను తీసి ఆసుపత్రిలో భద్రపర్చమని, వీటి పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి పంపనున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement