సాయం అడగక రైతు ప్రాణం పోయింది
Published Sat, Mar 4 2017 3:22 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
అనంతపురం: విద్యుత్ సిబ్బంది సాయం తీసుకోకుండా రైతులే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు ఒకరు చనిపోయారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని కనగానిపల్లె మండలం కొండంపల్లెలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రైతులు తమ పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ బిగించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, విద్యుత్ సిబ్బంది లేకపోవటంతో అధికారులు లైన్‌క్లియరెన్స్(ఎల్‌సీ) ఇవ్వలేదు. అయినప్పటికీ రైతులు తమ ప్రయత్నాలు చేపట్టగా ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రామసుబ్బయ్య(45)అనే రైతు అక్కడికక్కడే చనిపోగా రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Advertisement
Advertisement