అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : సమస్యల పరిష్కారం కోసం ట్రాన్స్‌కో ఉద్యోగులు ఆదివారం నుంచి మెరుపు సమ్మె చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె తీవ్రత తొలిరోజు స్వల్పంగా ఉన్నా..ఇప్పటి నుంచి తీవ్రమయ్యే అవకాశం ముందని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ట్రాన్స్‌కో ఉద్యోగులు జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. నిర్ణీత వేళల్లో వ్యవసాయానికి, గ్రామీణ,పట్టణ, నగర ప్రాంతాలకు కరెంటు సరఫరా చేస్తున్నారు. అయితే... ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు. లైన్‌మెన్ స్థాయి నుంచి డీఈ వరకూ సమ్మెలో పాల్గొంటున్నారు.
ఆదివారం అనంతపురం నగరంలో అనేక ప్రాంతాలకు కరెంట్ సరఫరా కాలేదు. ఉద్యోగులంతా ఒకేసారి సమ్మెలోకి పోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు కూడా వీలులేకుండా పోయిందని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు వివరించారు. నేడు, రేపు ఉద్యోగులతో ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుపుతారని, సాధ్యమైనంత వరకూ ఫలిస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. సమ్మె కాలంలో కరెంట్ కష్టాలు ఎదురైతే తమ చేతిలో లేదని, సాధ్యమైనంత వరకూ ప్రజలకు కష్టాలు రానీయకుండా చూస్తామని అన్నారు.
మెరుపు సమ్మె
Published Mon, May 26 2014 2:05 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement