స్టార్టింగ్ ట్రబుల్ తెచ్చిన తంటా | Trouble starting bus in Dvarakatirumala | Sakshi
Sakshi News home page

స్టార్టింగ్ ట్రబుల్ తెచ్చిన తంటా

Published Mon, Oct 6 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

స్టార్టింగ్ ట్రబుల్ తెచ్చిన తంటా

స్టార్టింగ్ ట్రబుల్ తెచ్చిన తంటా

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమలలోని శేషాచలం ఘాట్‌రోడ్డు ఆదివారం ఉదయం హాహాకారాలతో మార్మోగింది. యాత్రా బస్సు అదుపుతప్పటంతో 21 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇవి.. విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం మద్ది గ్రామానికి చెందిన 40 మంది భవానీ దీక్షధారులు దీక్ష విరమణకు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి టూరిస్ట్ బస్సులో వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుంచి ఆదివారం వేకువ జాము 3 గంటలకు ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. బస్సుకు స్టార్టింగ్ ట్రబుల్ ఉండటంతో శేషాచలం ఘాట్‌రోడ్డు వాలులో డ్రైవర్ బస్సును పార్కింగ్ చేశాడు. స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణానికి ఉదయం 8 గంటలకు యూత్రికులు బస్సు వద్దకు చేరుకున్నారు.
 
 ప్రమాదం జరిగింది ఇలా..
 మొత్తం 40 మంది యాత్రికుల్లో 30 మంది బస్సు ఎక్కారు. డ్రైవర్ టెంపల్లి బంగార్రాజు బస్‌ను స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోరుుంది. రన్నింగ్‌లో స్టార్ట్ చేసేందుకుగాను బస్సు చక్రాల కింద ఉంచిన రాళ్లను తొలగించమని క్లీనర్ గంగరాజుకు సూచించాడు. రాళ్లు తొలగించిన అనంతరం బస్సు గేర్‌ను న్యూట్రల్ చేయడంతో అది కొండపై నుంచి దిగువకు వేగంగా దూసుకుపోవటం ప్రారంభించింది. ఎయిర్ బ్రేకులు పనిచేయలేదు. డ్రైవర్ సమయ స్ఫూర్తిగా లింగయ్య చెరువు సమీపంలోని 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీకొనకుండా తప్పించాడు.  బస్సు ఆ చెరువు గట్టుఢీకొని మీదకు ఎక్కింది.  ఉండటంతో చెరువులోకి పడకుండా నిలిచింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రమాద సమయంలో ఏ వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. యాత్రికులు ఒకరికొకరు ఢీకొట్టుకోవటం, బస్సులో కింద పడిపోవడంతో గాయూలయ్యూరుు. వెంటనే స్థానికులు, పోలీసులు  క్షతగాత్రులను బయటకు తీశారు. 12 మందికి తీవ్రంగా, 9 మందికి స్వల్పంగా గాయూలయ్యూరుు. రెండు 108 అంబులెన్స్‌లలో ద్వారకాతిరుమల పీహెచ్‌సీకి  తరలించారు.
 
 ముందునుంచే మొరాయించిన బస్సు
 యాత్ర ప్రారంభం నుంచే లక్ష్మీదేవి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు మొరాయిస్తూనే ఉందని యాత్రికులు చెప్పారు. ఆగిన ప్రతిసారి తాము తోస్తూ వచ్చామన్నారు. స్టార్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో డ్రైవర్ బస్సును వాలు ప్రాంతంలో పార్కింగ్ చేశాడన్నారు. బస్సు కండిషన్‌లో లేకపోవటమే ప్రమాదానికి కారణమని చెప్పారు.
 
 గాయాలైన వారు వీరు..
 విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం మద్ది గ్రామానికి చెందిన రామసింగ్ పద్మనాభస్వామి, కనకల మహాలక్ష్మి, కనకల పున్నమ్మ, రామసింగ్ పైడిరాజు, చిన్నారి ఆర్.లిఖిత , లక్ష్మీవరప్రసాద్, రామసింగ్ అప్పలకొండ, పడాల అప్పాయమ్మ, టెంపల్లి బంగార్రాజు (డ్రైవర్), కనకల సత్యనారాయణ, కనకల దుర్గాప్రసాద్, విశాఖజిల్లా తాడుతూరుకు చెందిన ఎలుసూరి వెర్రిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. మద్ది గ్రామానికి చెందిన కాళ్ల సూరిబాబు, సురాల కృష్ణ, వేణు రమణమ్మ, భూగత సత్యవతి, కాళ్ల నాగమణి, చిన్నారులు కనకల దుర్గమ్మ, రామసింగ్ ప్రసాద్, పోవన ప్రసాద్, కనకల శాంతికి స్వల్ప గాయూలయ్యూరుు.  
 
 పీహెచ్‌సీలో అందుబాటులోలేని వైద్యులు
 ద్వారకాతిరుమల పీహెచ్‌సీకి క్షతగాత్రులను తరలించగా వైద్యులు అందుబాటులో లేరు. సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ప్రముఖ పుణ్య క్షేత్రంలోని పీహెచ్‌సీలో   వైద్యులు అందుబాటులో లేకపోవటంతో బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రగాయూలైన 12 మందిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన అనంతరం వైద్యులు పీహెచ్‌సీకి చేరుకున్నారు. పీహెచ్‌సీలోని క్షతగాత్రులను భీమడోలు సీఐ దుర్గాప్రసాద్, తహసిల్దార్ చవాకుల ప్రసాద్ పరామర్శించారు. ఎస్సై కర్రి సతీష్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement