సాక్షి, హైదరాబాద్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ లోవర్ థియరీ పరీక్షలు ఈ నెల 10న జరగనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ పుల్లయ్య ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని ట్రేడులకు సంబంధించిన టైంటేబుల్‌ను జిల్లాల విద్యాధికారులకు పంపామని, విద్యార్థుల వివరాలు, రోల్ నంబర్లను www.bseap.orgవెబ్‌సైట్లో పొందుపరిచామన్నారు.
ఉత్తమ పాలిటెక్నిక్ టీచర్ల ఎంపిక: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజీల నుంచి ఉత్తమ టీచర్లను గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ లెక్చరర్ల కేటగిరీలో పలమనేరు మహిళా పాలిటెక్నిక్ లెక్చరర్ డాక్టర్ మహమూద్, లెక్చరర్ల కేటగిరీలో ఇదే కాలేజీలోని డాక్టర్ ఎన్.సులోచనలను ఎంపికచేశారు.
10న టీటీసీ పరీక్షలు
Published Thu, Sep 3 2015 8:43 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement
Advertisement