ttc exams
-
టీటీసీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్!
డోన్ టౌన్ : స్థానిక పాతపేట ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న టీటీసీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోంది. ఈనెల 3వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలను 263 మంది విద్యార్థులు రాస్తున్నారు. మాస్ కాపీయింగ్ జరుగుతోందనే సమాచారంతో సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లిన విలేకరులను చూసి ఇన్విజిలేటర్లు విద్యార్థులను అలర్ట్ చేశారు. దీంతో విద్యార్థులు కిటికీల గుండా కాపీలను పారవేశారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మకాం వేసిన కొందరు కాపీలను పరీక్షా కేంద్రంలోకి పంపుతుండడం గమనార్హం. దీనిపై చీఫ్ ఇన్విజిలేటర్ మైకేల్ వివరణ కోరగా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారమే లేదని చెప్పుకొచ్చారు. -
10న టీటీసీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ లోవర్ థియరీ పరీక్షలు ఈ నెల 10న జరగనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ పుల్లయ్య ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని ట్రేడులకు సంబంధించిన టైంటేబుల్‌ను జిల్లాల విద్యాధికారులకు పంపామని, విద్యార్థుల వివరాలు, రోల్ నంబర్లను www.bseap.orgవెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఉత్తమ పాలిటెక్నిక్ టీచర్ల ఎంపిక: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజీల నుంచి ఉత్తమ టీచర్లను గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ లెక్చరర్ల కేటగిరీలో పలమనేరు మహిళా పాలిటెక్నిక్ లెక్చరర్ డాక్టర్ మహమూద్, లెక్చరర్ల కేటగిరీలో ఇదే కాలేజీలోని డాక్టర్ ఎన్.సులోచనలను ఎంపికచేశారు.