
టీటీసీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్!
మాస్ కాపీయింగ్ జరుగుతోందనే సమాచారంతో సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లిన విలేకరులను చూసి ఇన్విజిలేటర్లు విద్యార్థులను అలర్ట్ చేశారు. దీంతో విద్యార్థులు కిటికీల గుండా కాపీలను పారవేశారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మకాం వేసిన కొందరు కాపీలను పరీక్షా కేంద్రంలోకి పంపుతుండడం గమనార్హం. దీనిపై చీఫ్ ఇన్విజిలేటర్ మైకేల్ వివరణ కోరగా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారమే లేదని చెప్పుకొచ్చారు.