అచ్చంపేట,న్యూస్‌లైన్: నల్లమల అడవుల్లో మరణమృదంగం మోగుతోంది. ఇక్కడి చెంచులను ‘క్షయ’ హరిస్తోంది. సరైన పర్యవేక్షణలో వారికి ఈ మందులు ఇవ్వక పోవడంతో రోగాలు ము దిరి ఈ గిరిజనులు తవతమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో ఈ ప్రభావం వీరి జనాభాపై కూడా పడి ఆందోళన కలిగిస్తోంది. వీరి సంక్షేమాన్ని చూడాల్సిన సమీకృత గిరిజనాభివద్ధి సంస్థ (ఐటీడీఏ) పనితీరు ఆశాజనకం గా లేకపోవడంతో వారికి సేవలు సక్రమంగా అందడం లేదు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న చెంచులు క్షయ, రక్తహీనత, తదితర దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు.
ఆరోగ్య సేవలు ఏవీ...
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా చెంచులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారే తప్ప, దీర్ఘకాలిక రోగాల గురించి వైద్య ఆరోగ్య శాఖ, ఐటీడీఏ పట్టించుకోకపోవడంతో వ్యా ధులు ముదురుతున్నాయి. ఈ ప్రాంతంలో మలేరియా, క్షయ తదితర శ్వాసకోశ వ్యాధులతో రెండేళ్ల కాలంలో 30 మంది చెంచులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవి చాలా వరకు వెలుగులోకి రావడం లేదు. జిల్లాలో మూడువేల మందికి గాను 84 మంది టీబీ బాధితులు ఉన్నట్లు గుర్తించారు.
నల్లమల ప్రాంతంలోని చెంచుపెంటల్లో 200ల మందికి పైగా టీబీ బాధితులు ఉంటారు. నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండల పరిధిలో 21 మంది, అచ్చంపేట మండలంలో ఇద్దరు, బల్మూర్ మండలంలో ఒకరు, లింగాలలో ముగ్గురు వంతున టీబీ బాధితులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. వైద్య సిబ్బంది ఏరోజు కూడా లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటలను సందర్శించిన దాఖలాలు లేవు. తప్పుడు లెక్కలతో కాలం గడిపేస్తున్నారు. ఫలితంగా వాస్తవ పరిస్థితి బాహ్య ప్రపంచానికి తెలీడం లేదు.
కోర్సు తీసుకోకపోవడం వల్లే...
మందులకు లొంగని టీబీ రోగులు రోజుకు 13 మాత్రలు, ఒక ఇంజెక్షన్ ఆరు నెలల పా టు కచ్చితంగా తీసుకోవాలి. ఆతర్వాత రో జూ ఆరు మందుల వంతున 14 నెలల వాడా లి. సాధారణ టీబీకి ప్రతీ రోజు ఏడు మాత్ర ల చొప్పున ఆరునెలలు వాడాలి. వ్యాధి పీడితులు ప్రతి రోజు వినియోగించాల్సిన మందులు అధిక పరిమాణంలో ఉండటంతో చాలా మంది చెంచులు వీటిని సక్రమంగా వాడటం లేదు. మధ్యలోనే మానివేయడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాలు హరించి వేస్తోంది. క్షయ నియంత్రణకు వైద్య సిబ్బంది ప్రతి నెల మందులు సరఫరా చేస్తున్నారే తప్ప వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించలేక పోతున్నారు. గిరిజనుల అవగాహనా లేమి కూడా రోగ తీవ్రతకు కారణమవుతోంది.
నిండు నిర్లక్ష్యం..!
అచ్చంపేట సివిల్ అస్పత్రి పాటు సిద్దాపూర్, అమ్రాబాద్, పదర,మన్ననూర్, వట్టువర్లపల్లి, బల్మూర్, లింగాల, అంబడిపల్లిలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. ఆయా పీహెచ్‌సీల పరిధిలో పలు చెంచు పెంటలు ఉన్నప్పటికీ వైద్యసేవలు అంతంతమాత్రమే. చెంచులు విషజ్వరాలకు గురైన వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నప్పుడు మాత్రమే పెంటలకు వైద్యులు తరలివచ్చి శిబిరాలను నిర్వహిస్తారు. కానీ నిరంతరంగా వైద్యసేవలను కల్పించి స్థానికుల ప్రాణాలను కాపాడలేకపోతున్నారు.
నల్లమలలో మరణమృదంగం
Published Thu, Jan 9 2014 6:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement