జగదేవ్‌పూర్/నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రమాదవశాత్తు జరిగిన వేర్వేరు సంఘ టనల్లో నీట మునిగి ఇద్ద రు మృతి చెందారు. బైకు కడిగేందుకు వచ్చి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మండల పరిధిలోని ఇటిక్యాల మదిరా కొత్తపేటకు చెందిన బత్తిన వెంకటేశం గౌడ్ (30) మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బత్తి ని ఐలయ్య సావిత్రి దంపతుల కుమారుడు బత్తిని వెంకటేశం గౌడ్ ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ రావడంతో కుటుంబ సభ్యులతో గడపడానికి ఇంటికి వచ్చాడు.
గురువారం సాయంత్రం ఇంట్లో ఉన్న బైకును కడి గేందుకు గ్రామంలో గల దేవరచెరువు వద్దకు వెళ్లాడు. బైక్ తీసుకుని వెళ్లిన వెంకటేశం గౌడ్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారి ని అడిగినా ఫలితం లేకుండా పోయింది. రాత్రి గ్రామంలో గల చెరువు వద్దకు వెళ్లి చూడగా ద్విచక్రవాహనం కనిపించింది. దీంతో మృతుడి కుటుం బీకులు గ్రామస్తులకు సమాచారం అం దించారు. ఈతగాళ్లు చెరువు నుంచి వెంకటేశం గౌడ్ మృ తదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య సుజాత, కుమార్తె శివానిలు ఉన్నారు. గ్రామస్తులు శుక్రవారం పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎస్‌ఐ హన్మంత్ నాయక్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నర్సాపూర్ రూరల్ : స్నానానికని చెరువులో దిగి ప్రమాదవశాత్తు అందులో మునిగి మండల పరిధిలోని అవంచ గ్రామానికి చెందిన నిర్మల కుమారుడు లకణ్య (16) శుక్రవారం మృతి చెందా డు. గ్రా మస్తుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని నాదేండ్ జి ల్లా గోదాంగావ్ గ్రామానికి చెందిన నిర్మల తన ముగ్గురు పిల్లలతో వలస వచ్చింది. అయితే ఇక్కడ ఇటుకల బట్టీల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శుక్రవారం ఉదయం నిర్మల కుమారుడు లకణ్య గ్రామ సమీపంలోని పెద్ద చెరువుకు స్నానం కో సం వెళ్లి ప్రమాదవ శాత్తు అందులో మునిగి మృతి చెందా డు. మృతుడి వెంట వెళ్లిన పిల్లలు విషయాన్ని తల్లి నిర్మలతో పాటు గ్రామస్తులకు తెలిపారు. వారు చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇదిలా ఉండగా.. మృతుడి తండ్రి గతంలోనే మరణించాడు. లకణ్యకు అక్క సోని, చెల్లెలు రాణిలు ఉన్నారు. ఈ విషయమై పో లీసులను వివరణ కోరగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
చెరువులో మునిగి ఇద్దరు మృతి
Published Sat, Jan 18 2014 12:06 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement