తాటి ఆకులు కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
చందర్లపాడు(కృష్ణా జిల్లా) : తాటి ఆకులు కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. చింతలపాడు గ్రామానికి చెందిన ధారవత్ అద్యానాయక్(45), వెంకటేశ్వరావు(35)లు ఇద్దరూ కలిసి తాటి ఆకులు కొడుతున్నారు. ఇందుకోసం ఇనుప పైపుకు కొడవలిని కట్టి కోస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ప్రమాదవశాత్తు కొడవలి జారిపోయి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుద్ఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఒకేసారి చనిపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి.