విశాఖపట్టణం:
గంగవరం పోర్టులో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. నౌకలో రైలు పట్టాలు లోడ్ చేస్తుండగా క్రేన్ హుక్ తెగిపడింది. దీంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతిచెందిన కార్మికులు సబ్బవరం వాసులుగా గుర్తించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోర్టు అధికారులు హూటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.