Gangavaram port
-
బాబు స్క్రిప్టు.. షర్మిల రిపీట్
సాక్షి, అమరావతి: కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు... అవి అబద్ధాలని అందరికీ తెలిసిపోతుండటంతో తన స్క్రిప్టును చదవటానికి ఇతరులను ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించేసిన బాబు... ఇపుడు పీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిలను ప్రవేశపెట్టి, తన స్క్రిప్టును ఆమెచేత కూడా వల్లె వేయిస్తున్నారు. అందుకేనేమో... గంగవరం పోర్టుపై కనీస అవగాహన కూడా లేనట్లుగా ఆమె చంద్రబాబు చేసిన ఆరోపణలనే రిపీట్ చేశారు. రూ.70,000కోట్ల విలువైన గంగవరం పోర్టును అదానీ గ్రూపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లకు అమ్మేసిందంటూ ఆమె బుధవారం విశాఖలో మాట్లాడారు. అసలు ఆ పోర్టు విలువ ఆమె చెప్పిన దాన్లో 10 శాతం కూడా లేదని... అందులోనూ ఆ పోర్టులో 89.6 శాతం వాటా ప్రయివేటు వారిదని, దాన్ని అదానీ కొనుగోలు చేసిందని... అది ఇద్దరి మధ్య జరిగిన ప్రయివేటు డీల్ అనే వాస్తవాన్ని మాత్రం చెప్పలేదు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేసిన గంగవరం పోర్టులో 89.6 శాతం వాటా ప్రమోటర్ డీవీఎస్ రాజు, ఆయనకు పెట్టుబడులు సమకూర్చిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీది. మరి అలాంటి పోర్టును రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లకు ఎలా విక్రయిస్తుంది? రాష్ట్రం విక్రయించగలిగేది తన చేతిలో ఉన్న 10 శాతం వాటానే కదా? వాస్తవానికి డీవీఎస్ రాజు గ్రూపు–అదానీ గ్రూపు ఆ పోర్టు విలువను ఆర్థిక సంస్థల చేత మదింపు చేయించగా రూ.6,200 కోట్లుగా లెక్కగట్టాయి. దీంతో అదే ధరకు డీవీఎస్ రాజు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలకున్న వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. మరి ఈ షర్మిల చెప్పిన రూ.70వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? వాస్తవానికి అవి చంద్రబాబు స్క్రిప్టులో నుంచి వచ్చాయి. గతంలో బాబు కూడా అది రూ.70వేల కోట్ల విలువైన పోర్టు అని... దాన్ని ప్రభుత్వం రూ.600 కోట్లకే విక్రయించేసిందని పచ్చి అబద్ధాలతో ప్రభుత్వంపై బురదజల్లారు. కానీ ప్రభుత్వం వాస్తవాలను వివరిస్తూ గట్టిగా స్పందించటంతో... ఇప్పుడు అదే బురదను షర్మిల ద్వారా చల్లిస్తున్నారు. నిజానికి ప్రభుత్వానిది ఈ పోర్టులో 10.4 శాతం వాటా మాత్రమే. అయితే పోర్టు విస్తరణకు వీలుగా ఆ వాటా విక్రయించాలని కొనుగోలుదారు అభ్యర్థించటంతో ప్రభుత్వం నిపుణులు సూచించిన ధరకన్నా రూ.20 కోట్లు అధికంగానే... అంటే రూ.644.45 కోట్లకు దీన్ని విక్రయించింది. పైపెచ్చు ఆ నిధులతో ఇపుడు మరో మూడు కొత్త పోర్టులను ప్రభుత్వమే సొంతంగా అభివృద్ధి చేస్తోంది. ఇక డీవీఎస్ రాజు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వార్బర్గ్ పింకస్ చేతి నుంచి అదానీ గ్రూపు చేతికి మారింది పోర్టు నిర్వహణ మాత్రమే. ప్రభుత్వంతో గతంలో కుదిరిన లీజు ఒప్పందంలో ఎలాంటి మార్పులూ లేవు. మరి భూములతో సహా విక్రయించేసినట్లు మాట్లాడటం షర్మిల అవగాహన రాహిత్యానికి నిదర్శనం కాదా?. కొత్త పోర్టుల నిర్మాణానికి నిధులు అదానీ గ్రూపు ప్రతిపాదనను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 జూన్ 4న కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేసింది. విలువ మదింపు కోసం సెబీ గుర్తింపు పొందిన కేపీఎంజీ, న్యాయ సలహాల కోసం జేఎస్ఏ అసోసియేట్స్, ఒప్పందంలో పాటించాల్సిన సలహాల కోసం గ్రాంట్ థార్న్టన్లకు బాధ్యతలను ఈ కమిటీ అప్పగించింది. వారు గంగవరం పోర్టు షేరు ధరను రూ.115గా లెక్కించారు. రూ.5 అదనంగా చెల్లిస్తుండటంతో ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజే సలహా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్లింది. తన 10.4 శాతం వాటాను రూ.644.45 కోట్లకు విక్రయించింది. ఈ మొత్తాన్ని కొత్తగా చేపట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులకు ప్రభుత్వం వినియోగిస్తోంది. పోర్టు విలువ రూ.6,200 కోట్లుగా మదింపు పీపీపీ విధానంలో ప్రమోటరు డీవీఎస్ రాజు గంగవరం పోర్టు లిమిటెడ్ పేరుతో ఈ పోర్టును అభివృద్ధి చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 1,800 ఎకరాల భూమి విలువ రూ.54 కోట్లుగా లెక్కించి పోర్టులో 10.4 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మిగిలిన వాటాలో ప్రధాన ప్రమోటరు డీవీఎస్ రాజు చేతిలో 58.1 శాతం, పోర్టు నిర్మాణానికి నిధులు సమకూర్చిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్మెంట్ (వార్బర్గ్ పింకస్) పేర 31.5 శాతం ఉన్నాయి. పోర్టు విలువను రూ.6,200 కోట్లుగా మదింపు చేసి, ఆ మేరకు ప్రమోటర్ల నుంచి 89.6 శాతం వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. అది ఆ ఇద్దరి మధ్య జరిగిన ప్రయివేటు ఒప్పందం. ఇక పోర్టు కొన్నాక అదానీ గ్రూపు కొత్తగా రెండు టెర్మినల్స్ అభివృద్ధి చేయడంతోపాటు లాజిస్టిక్ వంటి విభాగాల్లో భారీ విస్తరణ చేపట్టింది. కానీ దీన్లో ప్రభుత్వ వాటా 10.4 శాతం ఉండటం వల్ల ఇబ్బందులు రావటంతో ఆ వాటాను కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రమోటర్లకు చెల్లించిన విధంగానే షేరుకు రూ.120 చొప్పున చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఆస్తులు, భూములు తిరిగి ఇచ్చే విధంగా ఒప్పందం ఇక పోర్టులో వాటా విక్రయం తర్వాత రాయితీలకు సంబంధించి అదానీ గ్రూపుతో ఏపీ మారిటైమ్ బోర్డు స్పష్టమైన ఒప్పందం చేసుకుంది. 30 ఏళ్ల లీజు తర్వాత పోర్టు ఆస్తులు, భూములు తిరిగి ఇచ్చే నిబంధనను అందులో పొందుపరిచింది. ఒకవేళ లీజు గడువు పెంచుకోవాలంటే ప్రభుత్వ అనుమతితో 10 ఏళ్లు చొప్పున రెండు సార్లు పెంచుకునేందుకు అనుమతిస్తారు. ఇక పోర్టు వ్యాపారంలో 2.1 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించాలి. ఆ విధంగా పోర్టు నిర్వహణను ఆదానీ చేపట్టిన తర్వాత రెండేళ్లలో (2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో) రాయల్టీ, లీజు అద్దె రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.60.01 కోట్ల ఆదాయం సమకూరింది. త్వరలో కొత్తగా అభివృద్ధి చేసిన రెండు కార్గో టెర్మినల్స్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఆదాయం మరింత పెరుగుతుందని, ఈ పోర్టుపై ప్రభుత్వం ఎలాంటి హక్కులను వదులుకోలేదని ఏపీ మారిటైమ్ బోర్డు స్పష్టం చేసింది. -
విశాఖ గంగవరం పోర్టు వద్ద కార్మికుల ధర్నా
-
విశాఖ.. ఎగుమతులకు స్వర్గధామం
సాక్షి, విశాఖపట్నం: ఎగుమతుల్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ), గంగవరం పోర్టు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ సహకారం.. సరుకు రవాణా రంగంలో సత్ఫలితాలిస్తున్నాయి. వీపీఏలో 32 బెర్త్‌లు, గంగవరంలో 9 బెర్త్‌లున్నాయి. ఇందులో మొత్తం 23 బెర్త్‌ల ద్వారా కార్గో కంటైనర్ ఎక్స్‌పోర్ట్స్ జరుగుతుంటాయి. విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యూఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా ప్రపంచ పెద్దన్న అమెరికాదే అగ్రస్థానం కావడం విశేషం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏకంగా రూ. 11,866 కోట్ల ఎగుమతులు జరిగాయి. తర్వాత స్థానంలో చైనా (రూ.8,307 కోట్లు), యూఏఈ (రూ.4,358 కోట్లు) ఉన్నాయి. ఎగుమతుల్లో సింహభాగం సముద్ర ఉత్పత్తులదే. అలాగే ఎగుమతుల్లో వృద్ధికి అవకాశమున్న అన్ని అంశాలనూ సద్వినియోగం చేసుకుంటూ.. విశాఖపట్నంలోని పోర్టులు తమ జోరును కొనసాగిస్తున్నాయి. ఎగుమతులకు సిద్ధం చేస్తున్న సముద్ర ఉత్పత్తులు ఇక్కడ లైసెన్స్ తీసుకుంటే.. దేశ విదేశీ ఎగుమతులకు కస్టమ్స్ శాఖ అనుమతులను సులభతరం చేయడంతో విశాఖ నుంచి సరుకు రవాణా మరింత వేగం పుంజుకుంటోంది. 24/7 కస్టమ్స్ అధికారులు పోర్టులో అందుబాటులో ఉంటూ.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వన్‌టైమ్ పర్మిషన్ విధానం అమలుచేస్తున్నారు. దీని ద్వారా డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ (డీపీఈ) కింద అనుమతులు వేగవంతమయ్యాయి. విశాఖ పోర్టుల్లో 29 శాతం వరకు ఈ తరహాలో ఎగుమతులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఈ విధానంవల్ల సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. ఈ–సంచిత్ సాంకేతికత ద్వారా పోర్టులోకి రాకముందే ఎగుమతికి సంబంధించిన సరుకు వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ సౌకర్యం తీసుకురావడంతో దాదాపు 90 శాతం సంస్థలు దీనిపైనే ఆధారపడుతూ.. ఎగుమతులను వేగవంతం చేస్తున్నాయి. ఎగుమతులకు సంబంధించి కస్టమ్స్ లైసెన్స్‌ను విశాఖపట్నంలో తీసుకుంటే చాలు.. దేశంలోని ఏ పోర్టు నుంచైనా.. ఏ దేశానికైనా ఎగుమతి, దిగుమతులు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈపీసీజీతో ఎగుమతి సంస్థలకు వెసులుబాటు దేశ విదేశాల ఎగుమతులకు విశాఖపట్నం స్వర్గధామంగా ఉంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) పథకం ద్వారా ఐజీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు లభిస్తుంది. షిప్పింగ్ బిల్స్ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసుకోవడం విషయంలోనూ వైజాగ్ కస్టమ్స్ ముందుంటుంది. ప్రతినెలా రూ.60 కోట్ల వరకు ఎగుమతిదారులు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఐజీఎస్టీ రిఫండ్ ప్రతినెలా రూ.45 కోట్లు జరుగుతోంది. ఆన్లైన్ పద్ధతుల ద్వారా ఎగుమతులను మరింత సులభతరం చేశాం. ఈ కారణంగా ఎగుమతుల విషయంలో వైజాగ్ దూసుకుపోతోంది. – డా. జేన్ జేసుదాస్, కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ -
గంగవరం పోర్ట్.. అదానీ పరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గంగవరం పోర్ట్ లిమిటెడ్‌లో (జీపీఎల్) మిగిలిన 58.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్, ఎన్సీఎల్టీ హైదరాబాద్ నుండి అనుమతులు పొందినట్టు అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఏపీఎస్‌ఈజడ్) సోమవారం వెల్లడించింది. షేర్–స్వాప్ విధానం ద్వారా డీవీఎస్ రాజు, కుటుంబం నుండి 58.1 శాతం వాటాను ఏపీఎస్‌ఈజడ్ కొనుగోలు చేస్తోంది. దీని ఫలితంగా పూర్వపు జీపీఎల్ ప్రమోటర్లకు దాదాపు 4.77 కోట్ల ఏపీఎస్‌ఈజడ్ షేర్లు జారీ చేస్తారు. కొనుగోలు పూర్తి అయితే జీపీఎల్లో ఏపీఎస్‌ఈజడ్‌కు 100 శాతం వాటా ఉంటుంది. జీపీఎల్‌ను రూ.6,204 కోట్లకు (ఒక్కొక్కటి రూ.120 చొప్పున 51.7 కోట్ల షేర్లు) కొనుగోలు చేసినట్టు ఏపీఎస్‌ఈజడ్ ప్రకటించింది. గంగవరం పోర్ట్ లిమిటెడ్‌లో వార్బర్గ్ పింకస్ నుంచి 31.5 శాతం వాటాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 శాతం వాటాను 2021–22లో అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దక్కించుకుంది. చదవండి: మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ! -
గంగవరం పోర్ట్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలు పూర్తి
దొండపర్తి (విశాఖ దక్షిణ): గంగవరం పోర్టు (జీపీఎల్)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) వెల్లడించింది. ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను రూ. 645 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. మరోవైపు, ఏపీఎస్ఈజెడ్లో జీపీఎల్ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనకు ఇరు కంపెనీల బోర్డ్‌లు ఆమోదముద్ర వేశాయి. దీని ప్రకారం జీపీఎల్ షేరు ఒక్కింటి విలువను రూ. 120గాను, ఏపీఎస్ఈజెడ్ షేరు విలువను రూ. 754.8గాను లెక్కించారు. విలీన డీల్ బట్టి ప్రతి 1,000 జీపీఎల్ షేర్లకు గాను 159 ఏపీఎస్ఈజెడ్ షేర్లు లభిస్తాయి. జీపీఎల్లో ప్రమోటరు డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉంది. విలీనానంతరం ఏపీఎస్ఈజెడ్లో వారికి సుమారు 2.2 శాతం వాటా (4.8 కోట్ల షేర్లు) లభిస్తాయి. దీని విలువ దాదాపు రూ. 3,604 కోట్లుగా ఉంటుందని ఏపీఎస్ఈజెడ్ పేర్కొంది. కంపెనీ ఇప్పటికే విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 31.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేయడంతో 100 శాతం వాటాలు దక్కించుకున్నట్లయ్యింది. 2022 మార్చి 31వ తేదీ నాటికి విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీఎస్ఈజెడ్ భావిస్తోంది. జీపీఎల్ కొనుగోలుతో తమ లాజిస్టిక్స్ సరీ్వసుల సామర్థ్యం మరింత మెరుగవుతుందని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీఎస్ఈజెడ్ సీఈవో కరణ్ అదానీ తెలిపారు. -
గంగవరం పోర్టులో.. ప్రభుత్వ వాటా ఉపసంహరణపై పిల్
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై దర్యాప్తు జరిపేలా ఏపీ లోకాయుక్తను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రొప్రయిటీ ఆడిట్ కూడా నిర్వహించేలా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన డాక్టర్ వైజా సత్యభూపాల్‌రెడ్డి, బొంత పూర్ణచంద్రారెడ్డిలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాల విక్రయం, కృష్ణపట్నం పోర్టు స్వాధీనం తదితరాల వ్యవహారంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని తెలిపారు. వాటాల విక్రయ వ్యవహారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని, అందుకు సంబంధించిన జీఓలను సైతం అందుబాటులో లేకుండా చేసిందని చెప్పారు. వాటాల ఉపసంహరణకు అంతర్జాతీయ స్థాయిలో బిడ్లు ఆహ్వానించి ఉంటే మరింత ఆదాయం ప్రభుత్వానికి వచ్చి ఉండేదన్నారు. లబ్ధిదారులను ప్రతివాదులుగా చేర్చాలి ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధిదారులుగా ఉన్న కంపెనీలను ప్రతివాదులుగా చేయలేదన్నారు. వారిని ప్రతివాదులుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగానే వాటాల ఉపసంహరణ జరిగిందని చెప్పారు. ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని తెలిపారు. గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
గంగవరం పోర్టు రికార్డ్!
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరుకు రావాణాలో ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్ట్ కొత్త రికార్డులను నమోదు చేసింది. మొబైల్ హార్బర్ క్రేన్స్‌ను ఉపయోగించి 24 గంటల వ్యవధిలో ఏకంగా 26,885 మెట్రిక్ టన్నుల ఎరువులను పోర్ట్ స్వీకరించింది. గతంలో ఈ రికార్డు కింద 16,690 టన్నులు మాత్రమే నమోదైంది. 64,575 మెట్రిక్ టన్నుల యూరియాను అందుకుంది. 24 గంటల్లో 23,500 మెట్రిక్ టన్నుల దుక్క ఇనుము, 46,700 మెట్రిక్ టన్నుల ఇనుము ధాతువు గుళికలు పోర్ట్ నుంచి సరఫరా అయింది. ఆగస్ట్ నెలలో కన్వేయర్స్ ద్వారా వైజాగ్ స్టీల్‌కు 6,08,706 మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణా చేశారు. నౌకాశ్రయం అత్యున్నత మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సామర్థ్యానికి ఇది నిదర్శనమని గంగవరం పోర్ట్ ఈడీ జి.జె.రావు తెలిపారు. చదవండి : HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్ల వంతు -
‘కార్గో’లో గంగవరం పోర్టు మరో మైలురాయి
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అత్యంత లోతైన, అధునాతన పోర్టుల్లో ఒకటైన గంగవరం పోర్టు సరుకుల ఎగుమతి దిగుమతుల్లో ఎప్పటికప్పడు రికార్డులు సృష్టిస్తోంది. అత్యాధునిక మౌలిక వసతుల కారణంగా మంగళవారం మరో మైలురాయిని అధిగమించింది. 24 గంటల్లోనే కార్గో హ్యాండ్లింగ్ చేస్తూ రికార్డు నమోదు చేసింది. మొబైల్ హార్బర్ క్రేన్స్ (ఎంహెచ్సీ) వినియోగిస్తూ 24 గంటల్లో ఏకంగా 26,885 మెట్రిక్ టన్నుల ఎరువును షిప్ నుంచి దిగుమతి చేసింది. గతంలో ఇదే పోర్టులో 24 గంటల్లో 16,690 మెట్రిక్ టన్నుల ఎరువులను డిశ్చార్జ్ చేసిన రికార్డుని అధిగమించింది. ఎంవీకే మ్యాక్స్ ఎంపరర్ నౌక తీసుకొచ్చిన 64,575 మెట్రిక్ టన్నుల యూరియాని అత్యంత వేగంగా దిగుమతి చేసింది. స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు అందించడంలోనూ గత నిర్వహణని అధిగమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 5,67,888 మెట్రిక్ టన్నులను కన్వేయర్ల ద్వారా ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్‌కు బదిలీ చేయగా.. ఆగస్టులో ఏకంగా 6,08,706 మెట్రిక్ టన్నులు బొగ్గును అందించింది. ఒక నెలలో ఇంత పెద్ద మొత్తాన్ని అందించిన గంగవరం పోర్టు అధికారులు, సిబ్బందికి స్టీల్‌ప్లాంట్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంగవరం పోర్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీజే రావు మాట్లాడుతూ అత్యున్నత మౌలిక వసతులు, నిర్వహణ సామర్థ్యాలను అందిపుచ్చుకోవడం వల్లే అనేక మైలురాళ్లని అధిగమిస్తున్నామన్నారు. పోర్టులో డీప్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయోజనాలు వాణిజ్య సంస్థలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. -
అదానీ పోర్టులో గంగవరం విలీనంపై కమిటీ
సాక్షి, అమరావతి: గంగవరం పోర్టు లిమిటెడ్ (జీపీఎల్)ను అదానీ పోర్టు సెజ్(ఏపీ సెజ్) లిమిటెడ్‌లో పూర్తిగా విలీనం చేసిన తర్వాత ఏర్పాటయ్యే ప్రత్యేక కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, గత ఒప్పందాలకు నష్టం వాటిల్లకుండా చూసేందుకు వివిధ శాఖలకు చెందిన ఆరుగురు కార్యదర్శులతో సాధికారిక కమిటీని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ కన్వీనర్‌గా ఉంటారు. రెవిన్యూ, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ప్రభుత్వ రంగ శాఖల కార్యదర్శి కేవీ రమణ, న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత కమిటీ సభ్యులుగా ఉంటారు. 60 రోజుల్లోగా కమిటీ నివేదిక.. గంగవరం పోర్టు ప్రమోటర్ డీవీఎస్ రాజు కుటుంబానికి చెందిన 58.1 శాతం, విండి లేక్‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన 31.5 శాతం షేర్లను ‘ఏపీ సెజ్’ కొనుగోలు చేసేందుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. భవిష్యత్తు విస్తరణ కార్యక్రమాల కోసం జీపీఎల్‌ను పూర్తిగా ఏపీ సెజ్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలతో అంగీకరించింది. గతంలో జీపీఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నిబంధనలు పాటిస్తూ ఆదాయానికి నష్టం లేకుండా కొత్తగా ప్రత్యేక కంపెనీ (ఎస్పీసీ)ని ఏర్పాటు చేస్తూ కొత్తగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. గత ఒప్పందాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేవిధంగా సూచనలతో 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కరికాల వలవన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ సెజ్‌తో కొత్త ఒప్పందం చేసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అందులో తెలిపారు. ఆ అంశాలు ఇవీ.. ► ప్రస్తుతం ఉన్న రాయితీ ఒప్పందం, భాగస్వామ్య ఒప్పందాల్లో ఎటువంటి మార్పులు లేకుండా చూడాలి ► ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వానికి చెల్లింపులు జరగాలి ► ఈ ప్రాజెక్టుకు చెందిన ఆస్తులకు రక్షణ ఉండాలి ► ఈప్రాజెక్టులో ప్రభుత్వ హక్కులు, ప్రయోజనాలు యధావిధిగా ఉండాలి ► ఒప్పందం ముగిసిన తర్వాత ప్రాజెక్టును ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి ► ఈ డిజిన్వెస్ట్‌మెంట్, విలీనం, కొత్తగా ప్రత్యేక కంపెనీ ఏర్పాటు లాంటివి నిర్దేశిత సమయంలోగా పూర్తి కావాలి ► దీనిపై ఎస్బీఐ క్యాప్ ప్రతిపాదించిన ప్రభుత్వ వాటా ఉపసంహరణ అంశాన్ని ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కమిటీ పరిశీలించవచ్చు ► అనుభవజ్ఞుల సలహాలు అవసరమైతే కమిటీ తీసుకోవచ్చు. -
గంగవరం పోర్టులో అదానీకి 89.6% వాటా
సాక్షి, అమరావతి: గంగవరం పోర్టు లిమిటెడ్(జీపీఎల్)లో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటాను రూ.3,604 కోట్లతో కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) లిమిటెడ్ తెలిపింది. ఈ ఒప్పందాన్ని నియంత్రణ సంస్థ ఆమోదించాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. జీపీఎల్లో వార్బర్గ్ పింకస్ సంస్థకు చెందిన 31.5 శాతం వాటాను మార్చి 3న ఏపీఎస్ఈజెడ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వార్బర్గ్ పింకస్, డీవీఎస్ రాజు, కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు వాటాను కలిపితే జీపీఎల్లో తమ వాటా 89.6 శాతానికి చేరుకుందని ఆ సంస్థ పేర్కొంది. అదానీ పోర్ట్స్ 2% అప్... గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ షేరు 2 శాతం ఎగిసింది. బీఎస్ఈలో ఒక దశలో ఏకంగా 4.67 శాతం ఎగిసి రూ. 755.35 స్థాయిని కూడా తాకి చివరికి 2.3 శాతం లాభంతో రూ. 738.20 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 2 శాతం లాభంతో రూ. 737 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈలో 11.74 లక్షలు, ఎన్ఎస్ఈలో 3 కోట్ల షేర్లు చేతులు మారాయి. -
‘గంగవరం’.. అదానీ పరం!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్ట్‌లో మెజారిటీ వాటాలు దక్కించుకోవడంపై అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పింకస్‌కు పోర్టులో ఉన్న 31.5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు రూ. 1,954 కోట్లు వెచ్చించనున్నట్లు అదానీ పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. డీల్ ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 120 ధర చొప్పున వార్బర్గ్ పింకస్‌కి ఉన్న మొత్తం 16.3 కోట్ల షేర్లను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేయనుంది. అనుబంధ సంస్థ విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వార్బర్గ్ పింకస్‌కు గంగవరం పోర్టులో వాటాలు ఉన్నాయి. ప్రమోటర్ల వాటాల కొనుగోలుకూ యత్నాలు గంగవరం పోర్టులో ప్రమోటర్లు డీవీఎస్ రాజు, కుటుంబ సభ్యులకు 58.1%, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10.4% వాటాలు ఉన్నాయి. ప్రమో టర్ల వాటాలనూ కొనుగోలు చేయడం ద్వారా పోర్టులో మెజారిటీ వాటాలు దక్కించుకోవాలని అదానీ పోర్ట్స్ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ప్రమోటర్లతో చర్చలు కూడా జరుపుతోందని పేర్కొన్నాయి. పోర్టు ప్రత్యేకతలివీ..: గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ) కాగా.. 2059 వరకూ రాయితీలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. 2019–20లో 34.5 ఎంఎంటీ కార్గోను పోర్టు హ్యాండిల్ చేసింది. 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం కలిగిన నౌకలు (వెసల్స్) సైతం పోర్టులో రాకపోకలు సాగించే వీలుంది. 9 బెర్తులతో కార్యకలాపాలు సాగిస్తోం ది. కోల్, ముడిఇనుము, ఎరువులు, లైమ్‌స్టోన్, స్టీల్ తదితర పలు కమోడిటీలను హ్యాండిల్ చేయ గల సౌకర్యాలను కలిగి ఉంది. గతేడాది గంగవరం పోర్ట్ రూ. 1082 కోట్ల ఆదాయాన్ని సాధించింది. రూ. 516 కోట్ల నికర లాభం ఆర్జించింది. పోర్ట్ రుణరహితమే కాకుండా రూ. 500 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
కరోనా: గంగవరం పోర్టు యాజమాన్యం విరాళం
సాక్షి, అమరావతి : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గంగవరం పోర్టు తరపున రూ.3 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోర్టు చైర్మన్ డివిఎస్ రాజు, సీఈఓ,మాజీ డీజీపీ ఎన్ సాంబశివరావులు కలిసి అందజేశారు. దీంతోపాటు గంగవరం పోర్టులో షేర్ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.16.25 కోట్లు ఇంటర్మ్ డివిడెండ్ చెక్‌ను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. (చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ) కర్నూలు : ►ముఖ్యమంత్రి సహాయనిధి కింద రిటైర్డ్ డీఆర్వో సుబ్బారెడ్డి రూ. లక్ష చెక్కును నంద్యాల ఆర్డీవో రామకృష్ణరెడ్డికి అందజేశారు. ►ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. లక్షా యాబై వేల చెక్కును ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డికి నంద్యాల మెడిసేవ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి అందించారు. ►ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ప్రజలకు కరుణ వ్యాధిపై నియంత్రణ చర్యలపై ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అవగాహన కలిగించారు. తర్వాత ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. గుంటూరు : ►వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ►ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో తెనాలిలోని తూర్పు కాల్వకట్టపై ఉన్న పేదలకు ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ►ఎమ్మెల్యే విడదల రజిని ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో 350 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. ►ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 2వేల మాస్కులు అందజేశారు. ప్రకాశం జిల్లా : ►ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ తన సొంత నిధులతో కనిగిరి కాశి రెడ్డి నగర్ ఎస్టీ కాలనీలో 1000 కుటుంబాలకు ఉచిత బియ్యం, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. ►కరోన వైరస్ నేపథ్యంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో దర్శి ఆటోనగర్‌లో పేదలకు నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందజేశారు. హైదరాబాద్ : కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతమ్ విద్యా సంస్థల చైర్మన్ ఎమ్. భరత్ కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలని, ప్రజలు అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
విశాఖలో పర్యటించిన తెలంగాణ మంత్రి
-
గంగవరంలో చిరుత సంచారం?
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమ గోదావరి) : రాజవరం పంచాయతీ గంగవరం గ్రామంలో చిరుతపులి సంచారం చేస్తుందన్న ప్రచారంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి దళితవాడలోని అటవీ ప్రాంతంలో కొండపక్కన పశువుల గొట్టం వద్ద చిరుతపులి కనపడినట్లు గ్రామానికి చెందిన కొందరు రైతులు పేర్కొన్నారు. పశువుల గొట్టం (పశువుల చావిడి)లో లేగదూడలను లక్ష్యంగా చేసుకుని చిరుతపులి మాటువేసి ఉండటాన్ని గమనించిన పశువులు బిగ్గరగా అరవడంతో అక్కడే ఉన్న రైతులు అనుమానం వచ్చి చూడగా చిరుతపులి వీరి కళ్లముందు నుంచే కొండ ఎగువ ప్రాంతానికి పారిపోయినట్లు తెలిపారు. దీంతో విషయం దావానంలా వ్యాపించడంతో పొలాల వద్ద ఉన్న రైతులు పశువులతో సహా ఇళ్లకు చేరుకున్నారు. రాత్రి వేళ కావడంతో యువకులు డప్పులు శబ్దాలు చేస్తూ గస్తీ తిరుగుతున్నారు. కొద్ది సంవత్సరాల కిందట గంగవరం ప్రాంతంలో చిరుతపులి జాడలు కనిపించిన అనంతరం సుమారు పది సంవత్సరాల తర్వాత మళ్లీ చిరుతపులి సంచారం కనపడిందని రైతులు తెలిపారు. -
పోర్టులో ప్రమాదం: ఇద్దరు కార్మికులు మృతి
విశాఖపట్టణం: గంగవరం పోర్టులో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. నౌకలో రైలు పట్టాలు లోడ్ చేస్తుండగా క్రేన్ హుక్ తెగిపడింది. దీంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన కార్మికులు సబ్బవరం వాసులుగా గుర్తించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోర్టు అధికారులు హూటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
లారీ.. ఏ దారి?
⇒గంజాయి లారీ గంగవరం పోర్టు వైపు వెళ్లడంతో అనుమానాలు! ⇒అక్రమ రవాణా ఎళ్లలు దాటుతున్నా దృష్టి సారించని అధికారులు ⇒‘డీఆర్ఐ’కు పట్టుబడిన సరకు విలువ రూ.కోటి పైమాటే ⇒కేసును తారుమారు చేసేందుకు యత్నాలు విశాఖపట్నం : ఏజెన్సీ నుంచి అనేక మార్గాల్లో.. అనేక విధాలుగా గంజాయి ఇతర రాష్ట్రాలకు, అక్కడి నుంచి విదేశాలకు అక్రమంగా రవాణా జరుగుతోంది. స్థానికంగా జరిగే రవాణాపై తప్ప విదేశాలకు జరిగే స్మగ్లింగ్‌పై ప్రభుత్వం గానీ, అధికారులు గానీ పెద్దగా దృష్టి సారించింది లేదు. పోనీ స్థానికంగానైనా అడ్డుకుంటున్నారా అంటే.. మాటలు తప్ప పెద్దగా దృష్టి సారించింది లేదు. కలెక్టర్ దగ్గర్నుంచి అన్ని ప్రభుత్వ విభాగాల అధికార ప్రతినిధులు ప్రత్యేకంగా కమిటీగా ఏర్పడి సమీక్షలు జరిపినా ఆశించినంత ఫలితం కనిపించలేదు. అయితే గంజాయి అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) కొట్టిన దెబ్బ సంచలనమైంది. విశాఖ ఏజెన్సీ నుంచి జాతీయ రహదారి మీదుగా శనివారం రాత్రి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ లారీని షీలానగర్ సమీపంలో డీఆర్ఐ విశాఖ ప్రాంతీయ శాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ లారీలో రూ.కోటిపైగా విలువైన 1,161 కిలోల గంజాయిని గుర్తించినట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. స్మగ్లర్లు తెలివిగా ఎవరికీ అనుమానం రాకుండా 3 కిలోల చొప్పున 386 ప్యాకెట్లుగా చేసి లారీలో ఎక్కించారు. వాటిపై టార్పాలిన్ కప్పి, దానిపై గ్రావెల్ పోసేశారు. చూసిన వారెవరైనా గ్రావెల్ లారీగానే భావిస్తారు తప్ప లోపల గంజాయి ఉందనే అనుమానం ఏ మాత్రం రాదు. ట్రక్కుల్లో పైకి కనిపించని చోట, ఆటోల కింద, అంబులెన్సుల్లో, చివరికి మనిషి నడుం చుట్టూ కట్టుకుని కూడా గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్న ఉదంతాలు చాలానే వెలుగు చూశాయి. కానీ ఇంత భారీ స్థాయిలో రాళ్ల మాటున మత్తు మందు రవాణా సాగిస్తుండటం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఇంత భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా వెనుక చాలా పెద్దల హస్తం ఉందని తెలుస్తోంది. విశాఖ ఏజెన్సీ నుంచి విదేశాలకు నేరుగా విశాఖ నుంచే స్మగ్లింగ్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. గంజాయి లోడుతో లారీ గంగవరం పోర్టుకు వెళుతుండగా గంగవరం ఫ్లైఓవర్ వద్ద డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారని ముందుగా వార్తలు వెలువడ్డాయి. కానీ అధికారిక ప్రకటనలో ఆ ప్రస్థావన లేదు. దీనికి తెరవెనుక పెద్దల మంత్రాంగం నడిపినట్లు సమాచారం. లారీతో పట్టుబడ్డ వ్యక్తిపై నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరి కోసం వేట ప్రారంభించామని డీఆర్ఐ చెబుతోంది. కానీ లారీ వెళ్లిన మార్గాన్ని బట్టి చూస్తే కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు నుంచి గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. ఇక్కడి నుంచి బయలుదేరిన సరకు వయా పెందుర్తి, గోపాలపట్నం, ఎన్ఎడీ, షీలానగర్, గాజువాక మీదుగా విజయవాడ వైపు వెళ్లాలి. కానీ గాజువాక నుంచి యుటర్న్ తీసుకుని కొత్త గాజువాక వైపుగా బార్ చెరువు రోడ్డు నుంచి గంగవరం పోర్టుకు చేరుతుండగా ఫ్లైఓవర్ వద్ద డీఆర్ఐ అధికారులు లారీ పట్టుకున్నట్లు తెలిసింది. డీఆర్ఐ అధికారులు లారీని సరకుతో సహా షీలానగర్‌లోని ఓ గోడౌన్‌కు తరలించారు. ఆ సమయంలో సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న గాజువాక పోలీసులను కూడా వారు గోడౌన్‌లోకి అనుమతించలేదు. ఆదివారం నాటి ప్రకటనలో మాత్రం లారీని షీలానగర్ సమీపంలో పట్టుకున్నామని మాత్రమే చెప్పారు. మిగతా విషయాలు దాచిపెట్టడం వెనుక బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఏజెన్సీ నుంచి ఇంత భారీ స్థాయిలో సరుకు గంగవరం పోర్టు వైపు వెళ్లడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ కేసు ఆధారంగా పోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు గంజాయి స్మగ్లింగ్ జరిగే అవకాశాలపై డీఆర్ఐ అధికారులు లోతుగా పరిశోధన చేసే అవకాశం ఉంది. -
'మహాధర్నాకు వెళ్తే అరెస్ట్ చేస్తాం'
విశాఖపట్నం: డిమాండ్ల సాధనకు గంగవరం పోర్టు వద్ద కాంట్రాక్టు కార్మికులు మంగళవారం మహాధర్నా నిర్వహించనున్నారు. మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గంగవరం, దిబ్బపాలెం, శ్రీనగర్ దిబ్బపాలెం గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున మహాధర్నాకు వెళ్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల వైఖరిని సీపీఎం నగర కార్యదర్శి గంగారావు ఖండించారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, ఒకరు మృతి
విశాఖ : విశాఖ జిల్లాపెద గంట్యాడ వద్ద ఓ గూడ్స్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గార్డ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. గూడ్స్ రైలు బొగ్గు లోడుతో గంగవరం పోర్ట్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. గాయపడినవారిని పోర్ట్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గంగవరం పోర్ట్ పనులు స్తంభింపజేసిన గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం అగదని రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విశాఖపట్నంలో స్పష్టం చేశారు. అందులో భాగంగా గంగవరం పోర్ట్ కార్యకలాపాలను ఆయన నేతృత్వంలో స్తంభింప చేశారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై కేంద్రం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో సమైక్యాంధ్ర నిరసనలు మిన్నంటాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. అలాగే విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది.