కారు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
చిత్తూరు (బి.కొత్తకోట) : గుర్తుతెలియని కారు ఢీకొని ద్విచక్రవాహనదారులకు తీవ్రగాయాలైన సంఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కోట మండలం జమ్మన్నబావి గ్రామానికి చెందిన కుమార్(24), గుర్నాథ్(28)లు ద్విచక్రవాహనం మీద కొండ పై నుంచి కిందకు వస్తున్న క్రమంలో గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. దీంతో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.