కొమరోలు (ప్రకాశం జిల్లా) : రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ డీసీఎం వ్యానును వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచర్ల మోటు వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.