విభజనపై కేంద్రమంత్రులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారం హైదరాబాద్లో విమర్శించారు. సీఎం,పీసీసీ అధ్యక్షుడు, ఎంపీలు,ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే కేంద్రం దిగొస్తుందన్నారు.
రాష్ట్ర విభజనపై చర్చ లేకుండా విభజన జరిగితే ప్రాజెక్ట్లు ఏడారులుగా మారతాయని అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఉన్న రహస్య చాఫ్టర్ను బహిర్గంతం చేయాలని యూపీఏ సర్కార్ను మరో సారి డిమాండ్ చేశారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు పుండుమీద కారం జల్లే విధంగా ఉన్నాయన్నారు.