బాబు పాలనలో డొల్లతనం రుజువైంది | Ummareddy venkateswarlu slams cm chandrababu on cherukulapadu narayanareddy murder | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో డొల్లతనం రుజువైంది

Published Sun, May 21 2017 9:42 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

బాబు పాలనలో డొల్లతనం రుజువైంది - Sakshi

బాబు పాలనలో డొల్లతనం రుజువైంది

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ నేతల హత్యల వంటి దుర్మార్గాలతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతో కాలం పరిపాలన సాగించలేదని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్ష నేతలను వేధించేది చాలక ఇంకా ఇలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలను హతమార్చడం దారుణమని, ఇలాంటి దురాగతాలను ప్రజలు చూస్తూ సహిస్తారనుకోవడం పొరబాటేనని ఆయన అన్నారు. నారాయణరెడ్డి హత్య కేసు విచారణ, నిందితులను పట్టుకోవడంలో పోలీసు అధికారులు తమ నిష్పాక్షికతను నిరూపించుకోవాలని, టీడీపీ ప్రభుత్వం కూడా నిష్పాక్షికంగా దోషులకు శిక్ష పడేలా వ్యవహరించాలని ఉమ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనలో డొల్లతనం ఈ హత్యతో రుజువైందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement