ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను చేరువచేస్తామని, ఇందు కోసం గ్రామ సచివాలయాలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున నియమిస్తామని, ప్రతి గ్రామ సచివాలయంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. సీఎం ప్రకటనతో ఉద్యోగాలు వస్తాయని యువత, సంక్షేమ పథకాలు ఇంటివద్దకే వస్తాయని ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో: అవినీతికి తావులేకుండా, సిఫార్సులతో సంబంధం లేకుండా అర్హుల ఇంటికే సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమిస్తామని ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించారు. అక్టోబర్ రెండో తేదీన గ్రామ సచివాలయాలను తీసుకొస్తామని, ఒక్కొక్క సచివాలయంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రమాణస్వీకార వేదికపై తెలి పారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన నిరుద్యోగ యువతలో ఉత్సాహం నింపింది. మరో వైపు అవినితికి, సిఫార్సులకు తావులేకుండా సంక్షేమ పథకాలు తమకు అందుతాయని ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఉద్యోగాల కల్పన ఇలా..
పంచాయతీరాజ్ ఇన్‌ఫర్‌మేటిక్ సిస్టం(ప్రిస్) సర్వే ప్రకారం జిల్లాలో 8,40,613 ఇళ్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. 8,23,237 ఇళ్లలో ప్రజలు నివసిస్తున్నారని తేల్చారు. ఈ లెక్క ప్రకారం ప్రతి 50 కుటుంబాలకు ఒకరి చొప్పున 16,465 మందికి వలంటీర్లుగా పనిచేసే అవకాశం కలుగుతుంది. వలంటీరుగా నెలకు రూ.5 వేల వేతనం అందుతుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి వలంటీర్ల నియామకం అమలులోకి రానుంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనతో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తంచేస్తోంది. వేలాది మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొంటున్నారు.
గ్రామ సచివాలయాల్లో 10 మందికి అవకాశం
గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాల ద్వారా పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులోకి వస్తుంది. గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ అవుతాయి. రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా గ్రామ పంచాయతీల నుంచి సుపరిపాలన అందనుంది. జిల్లాలో 1,029 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి పంచాయతీకి 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే 10,290 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉపాధి దక్కుతుంది. జిల్లాలో అక్టోబర్ రెండో తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 26,865 మంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సీఎం ప్రకటనతో యువతీ యువకులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. స్వగ్రామంలోనే ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుందని సంతోషిస్తున్నారు.
72 గంటల్లో సమస్యల పరిష్కారం
దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై ప్రజలు సంతోషం వ్యక్తంచేసుకున్నారు. రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసిన 72 రెండు గంటల్లోనే లబ్ధి చేకూరుతుందని, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరి సిఫార్సులూ అక్కర్లేదని చెప్పడంపై అభినందనలు కురిపిస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తానని సీఎం చెప్పడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.
సంక్షేమం చేరువ వైఎస్ జగన్
మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిసాలనలో మార్పులు తెచ్చేదిశగా అడుగులు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువకానున్నాయి. పంచా యతీల్లో సుపరిపాలన సాకారం కానుంది.మా భవిష్యత్తు మారనుంది.– శివారెడ్డి,జంగమహేశ్వపురం, గురజాల మండలం
వేలాది ఉద్యోగాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజన్న పాలన దిశగా అడుగులు వేస్తున్నారు. మ్యానిఫెస్టోను పవిత్ర గంథంగా భావించి ప్రమాణ స్వీకారం చేసిన రోజే, జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించేలా, గ్రామ వలం టీర్లు, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, మాటతప్పని, మడమ తిప్పని నేతగా పేరు తెచ్చుకొంటున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తారన్న నమ్మకం ఉంది.– రాంబాబు, వెంగళాయపాళెం, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment