అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య
Published Sat, Mar 28 2015 9:12 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుడ్లనాయినిపల్లి అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. వ్యక్తిని హత్య చేసిన అనంతరం గుర్తు పట్టేందుకు ఆనవాళ్లు లేకుండా చేశారు. మృతదేహం తల భాగాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు.
శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. దారిన పోయే వాళ్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా... వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Advertisement
Advertisement