
‘పోలవరాని’కి గంపగుత్తగా నిధులివ్వలేం
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
ఏలూరు రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం గంపగుత్తగా నిధులు ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆదివారం ఏలూరు లో ఆమె విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు ఒక్కసారిగా నిధులు ఇచ్చి తమ నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రాజెక్టుపై రాష్ర్ట ప్రభుత్వం అందించిన బ్లూప్రింట్ ఆధారంగానే కేంద్రం మంజూరు చేస్తుందని వివరించారు.నాబార్డ్ ద్వారా ప్రాజె క్టు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.