సాక్షి, కడప : సమైక్యాంధ్రే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా అలుపెరగని రీతిలో నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీక్షా దక్షతతో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు దసరా పండుగ సోమవారం రోజు సాగాయి. మంగళవారం సైతం దీక్షలను కొనసాగించారు.
ఈ దీక్షలకు జిల్లా కన్వీనర్ సురేష్‌బాబుతోపాటు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సంఘీభావం తెలిపారు. కడప నగరంలో సోమవారం వైఎస్సార్‌సీపీ నగర ఉపాధ్యక్షుడు మున్నా ఆధ్వర్యంలో 25 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, అంజాద్‌బాషా, మాసీమబాబు సంఘీభావం తెలిపారు. మంగళవారం నగర మాజీ కార్పొరేటర్ నాగమల్లారెడ్డి ఆధ్వర్యంలో 17 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అంజాద్‌బాషా, అఫ్జల్‌ఖాన్‌లు సంఘీభావం తెలిపారు.
ప్రొద్దుటూరు పట్టణంలో మంగళవారం రోజు 27వ వార్డుకు చెందిన రామ్మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో 15మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
రైల్వేకోడూరులో సోమవారం ఎస్.కొత్తపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత వేమన రాజా నేతృత్వంలో 20మంది రిలే దీక్షలో పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్ సీపీ నేతలు బ్రహ్మానందరెడ్డి, సుకుమార్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. మంగళవారం ఎస్.ఉప్పరపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు 10మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.రాజంపేట పట్టణంలో సోమవారం మైనార్టీ విభాగం వైఎస్సార్‌సీపీ నాయకుడు జావెద్‌బాషా ఆధ్వర్యంలో 40 మంది దీక్షల్లో పాల్గొన్నారు.
వీరికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పోలా శ్రీనివాసులురెడ్డి సంఘీభావం తెలిపారు. మంగళవారం కూచివారిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో 60మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సంఘీభావం తెలిపారు.
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో సోమవారం రోజు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మంగళవారం గిరినగర్ కాలనీకి చెందిన 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
కమలాపురం పట్టణంలో సోమవారం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మస్తానయ్య ఆధ్వర్యంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ నాయయకుడు వల్లెల సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో 40మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి సంఘీభావం తెలిపారు.
పులివెందులలో సోమవారం కొత్త బస్టాండు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ వాసులు 70 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు వరప్రసాద్, ప్రభాకర్, చిన్నప్ప ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.
రాయచోటిలో సోమవారం లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. మంగళవారం గాలివీడు మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత నాగభూషణ్‌రెడ్డి నేతృత్వంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
దీక్షా దక్షులు
Published Wed, Oct 16 2013 2:09 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement