
12 అర్ద రాత్రి నుంచి ఉధృతంగా ఉద్యమం: ఎపీఎన్జీఓ
విజయవాడ: ఈ నెల 12వ తేదీ అర్ద రాత్రి నుంచి ఉద్యమం ఉధృతం చేస్తామని ఎపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎపీ ఎన్జీఓలు సమ్మె చేయనున్న విషయం తెలిసిందే. 1986 తర్వాత రాష్ట్ర వ్యవస్థ మొత్తం సమ్మెలోకి వెళ్లడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. విభజన కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమేనన్నారు. సిడబ్ల్యూసి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించిన రోజు నుంచి ఏపి ఎన్జీఓలు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరువాత వారు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. 12 నుంచి ఉద్యమాన్ని
ఇంకా తీవ్రతరం చేయాలన్న యోచనలో ఉన్నారు.