విభజన బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ విధానమని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్పీ) పేర్కొంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడగొట్టడం వల్ల భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు వస్తాయని తెలిపింది. రాజకీయ స్వార్థంతోనే అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌ను చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆర్‌ఎస్పీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ చంద్రసూదన్ విమర్శించారు. రెండు రోజులు జరిగే పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఏఏ అజీజ్, ఎన్‌కే రామచంద్రన్, అభోనీ రాయ్, జానకీ రామ్, మనోజ్ భట్టాచార్జీ, ఆశీష్ ఘోష్ తదితరులతో కలిసి చంద్రసూదన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆందోళన పట్ల తమకు అపార గౌరవం ఉన్నా తమ విధానం ప్రకారం బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు వ్యతిరేకిస్తామని చెప్పారు.
సమైక్యాంధ్ర మా విధానం: ఆర్‌ఎస్పీ
Published Mon, Jan 13 2014 12:50 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement