Revolutionary Socialist Party
-
Kerala: రూ.100 కోట్ల ముడుపుల కలకలం
తిరువనంతపురం: కేరళలోని ఎన్సీపీ (శరద్)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే థామస్ కె.థామస్ అధికార ఎల్డీఎఫ్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జనాధిపత్య కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంటోనీ రాజు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(లెనినిస్ట్) ఎమ్మెల్యే కొవూర్ కుంజుమోన్లకు థామస్ ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎల్డీఎఫ్లో భాగస్వాములు. ప్రతిగా ఈ ఎమ్మెల్యేలిద్దరూ ఎన్సీపీ(అజిత్)లో చేరడం, పినరయి విజయన్‌పై ఒత్తిడి తెచ్చి కేబినెట్లో స్థానం దక్కించుకునేందుకు పథక రచన జరిగిందని ఆరోపణలున్నాయి. జూన్ 5న థామస్ నుంచి ఈ మేరకు తమకు ప్రతిపాదన వచి్చందని మాజీ మంత్రి కూడా అయిన రాజు సీఎం విజయన్ చెవిన వేశారు. దీనిపై ఆయన కుంజుమోన్‌ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు. ఈ వ్యవహారం అక్టోబర్ 25న త్రిసూర్‌లో జరిగిన సీపీఎం సమావేశం సందర్భంగా బయటకు వచి్చంది. ఎల్డీఎఫ్ మిత్ర పక్షం ఎన్సీపీ(శరద్)వర్గం ఎమ్మెల్యే థామస్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం విజయన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి థామస్ కేబినెట్లో అటవీ శాఖను కోరుతున్నారు. అయితే, సీఎం విజయన్, సీపీఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న మంత్రి శచీంద్రన్ ఆ శాఖను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అందుకే, ఒక రకంగా సీఎం విజయన్‌పై ఒత్తిడి తేవడం ద్వారా కేబినెట్లో చేరేందుకు థామస్ వేసిన పథకంగా భావిస్తున్నారు. ఎన్సీపీ(అజిత్), బీజేపీలు మహారాష్ట్రలో మిత్రపక్షాలే కాబట్టి.. ఈ పథకమే ఫలించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్సీపీ(అజిత్)లో చేరితే కేరళలో బీజేపీకి పరోక్షంగా లాభం కలిగి ఉండేది. ఏదేమైనప్పటికీ, మంత్రి వర్గంలో చేరే అవకాశాన్ని ప్రస్తుతానికి థామస్ కోల్పోయినట్లుగానే భావిస్తున్నారు. ఈ పరిణామాలపై తమకెలాంటి సంబంధం లేదని కేరళలో ఎన్సీపీ(అజిత్)నేత మహ్మద్ కుట్టి స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఎన్సీపీ(శరద్)కమిటీ ఎదుట ఇటీవల థామస్ హాజరై, ముడుపుల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమిటీ త్వరలోనే ఎన్సీపీ(శరద్) జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పీసీ చాకోకు నివేదిక ఇవ్వనుంది. -
నేటినుంచి అధిక ధరలపై పోరు
దోమలగూడ,న్యూస్‌లైన్: రానున్న ఎన్నికల్లో ప్రజావ్యతిరేక కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని, అది కూడా లెఫ్ట్ పార్టీల నాయకత్వంలో రావాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీఎంపీ అబనీరాయ్, రాష్ట్రకార్యదర్శి జానకిరాములు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ హోటల్లో ఈనెల 11,12,13 తేదీల్లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశ వివరాలను బుధవారం దోమలగూడ ఎస్ఎంఎస్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని, కాంగ్రెస్, బీజేపీలను పక్కకు పెట్టడడమే ఇందుకు నిదర్శనమన్నారు. వామపక్షాలు కూడా ప్రజాసమస్యలపై నిత్యం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రజామద్దతు అనుకున్నంత కూడగట్ట లేకపోతున్నామని, దీనిపై ఆలోచన చేయాల్సిన ఆవశ్యత ఉందన్నారు. ధరల పెరుగుదలపై ఈనెల 16 నుంచి 31 వరకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రాష్ట్రం విడిపోకూడదనేదే తమ పార్టీ విధానమని, అదే క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తున్నట్లు వారు చెప్పారు. పార్టీ యువజన విభాగమైన ఆర్వైఎఫ్ జాతీయ మహాసభలు మార్చి 2 నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
సమైక్యాంధ్ర మా విధానం: ఆర్ఎస్పీ
విభజన బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకిస్తాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ విధానమని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) పేర్కొంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడగొట్టడం వల్ల భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు వస్తాయని తెలిపింది. రాజకీయ స్వార్థంతోనే అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌ను చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ చంద్రసూదన్ విమర్శించారు. రెండు రోజులు జరిగే పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఏఏ అజీజ్, ఎన్కే రామచంద్రన్, అభోనీ రాయ్, జానకీ రామ్, మనోజ్ భట్టాచార్జీ, ఆశీష్ ఘోష్ తదితరులతో కలిసి చంద్రసూదన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆందోళన పట్ల తమకు అపార గౌరవం ఉన్నా తమ విధానం ప్రకారం బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు వ్యతిరేకిస్తామని చెప్పారు.