ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. ఏడవ రోజైన మంగళవారం కూడా విద్యాసంస్థలు మూతపడ్డారుు. ఉద్యోగులంతా ఉద్యమబాట పడ్డటంతో ప్రభుత్వ కార్యాలయూలు సైతం తెరుచుకోలేదు. మునిసిపల్ ఉద్యోగుల పెన్‌డౌన్ రెండో రోజుకు చేరింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌ను ఉపాధ్యాయులు బహిష్కరించారు. జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, బైఠారుుంపులు, ప్రదర్శనల నడుమ నిరసన జ్వాలలు మిన్నంటారుు. రజకులు, మేదరులు, నాయూ బ్రాహ్మణులు వంటి వృత్తిదారులతోపాటు పాలక్యాన్లు వంటి చిరు వ్యాపారులు సైతం ఉద్యమంలో జత కలిశారు. ఏలూరు మోతేవారి తోటలోని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు క్యాంప్ కార్యాలయాన్ని పశు సంవర్థక శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్జీవోలు ముట్టడించారు. ఓ యువకుడిని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుగా పేర్కొంటూ ఉద్యోగినులు గాజులు తొడిగి నిరసన తెలిపారు. కావూరి వెంటనే మంత్రి పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఉద్యమంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు మొగల్తూరు వెళ్లి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పాత ఇంటివద్ద ధర్నా నిర్వహించారు. ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు.
యువకుడి ఆత్మ బలిదానం.. మరొకరి ఆత్యహత్యాయత్నం
రాష్ట్ర విభజన ప్రకటనను తట్టుకోలేక ఉండి మండలం కోలమూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మొవ్వా మేషక్ (22) అనే యువకుడు మంగళవారం ఆత్మ బలిదానం చేశాడు. కామవరపుకోట మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన బొప్పారుు కాయల వ్యాపారి నూతి కిషోర్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. విభజన నిర్ణయం నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన తణుకు మండలం మండపాక శివారు ఎర్రనీలిగుంట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బొక్కా శంకరుడు (35) గుండెపోటుతో మృతి చెందాడు.
నిరసనల హోరు : జిల్లావ్యాప్తంగా వంటా వార్పు, ర్యాలీలు, కేసీఆర్, సోనియూగాంధీ, మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఏలూరులో మెకానిక్‌లు, స్వర్ణకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాగవంశం సంక్షేమ సంఘం, అర్చకుల సమాఖ్య ఆధ్వర్యంలో వంటా వార్పు చేశారు. వసంత మహల్ సెంటర్‌లో అర్చకులు చండీయాగం, పాలకొల్లులో రోడ్డుపై పురోహితులు హోమం నిర్వహించారు. తణుకు నరేంద్ర సెంటర్‌లో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శాంతి హోమం చేశారు. పాలకొల్లు మండలం లంకల కోడేరులో ‘అందాల రాకాసి’ చిత్రం షూటిం గ్‌ను అడ్డుకున్నారు. కొవ్వూరులో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తింది.
సినీ నటుడు మాగంటి మురళీమోహన్ పాల్గొన్నారు. కొవ్వూరు మండలం కాపవరం, తోగుమ్మి గ్రామాల్లో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దొమ్మేరులో విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి రెండు గంటలసేపు రహదారులను దిగ్బంధించారు. సోనియా, కేసీఆర్ ఫ్లెక్సీలను ఉతికి ఇస్త్రీ చేశారు. పట్టణంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. తణుకులో వంటా వార్పు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఆచంట కచేరి సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చింతలపూడిలో సోనియా, కేసీఆర్ బొమ్మలను బంతికి అతికించి ఫుట్‌బాల్ ఆడి నిరసన తెలిపారు. తాడేపల్లిగూడెంలో న్యాయవాదులు ఆటోలను తుడిచి నిరసన తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో రాస్తారోకోలు, ధర్నాలు, మానహారం, కేసీఆర్, సోని యా గడ్డి బొమ్మలతో శవయాత్రలు చేశారు. కార్ల, మెటార్‌ై సెకిళ్ల ర్యాలీలు చేశారు. ఆకివీడులో సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. భీమవరంలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి, ప్రకాశం చౌక్‌లో తగులబెట్టారు. హిజ్రాలు నృత్యాలు చేసి పదవుల్ని పట్టుకుని వేలాడుతున్న ప్రజాప్రతినిధుల తీరుపై నిరసన తెలి పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మార్వాడీలు ప్రదర్శన చేశారు. ప్రకాశం చౌక్ ఆందోళనకారులతో పోటెత్తింది. ఉండిలో వంటావార్పు, దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పాల్గొని మాట్లాడారు. చింతలపూడిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బోసుబొమ్మ సెం టర్‌లో ఆటాపాటా నిర్వహించారు. మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు పాల్గొన్నారు. కామవరపుకోటలో బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో యువకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో రాస్తారోకో, నడిరోడ్డుపై వంటావార్పు చేశారు. తాడేపల్లిగూడెంలో పాత ఇనుము వ్యాపారులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రదర్శనలు నిర్వహిం చారు. జంగారెడ్డిగూడెంలో రిలే దీక్షలు రెండో రోజుకు చేరారుు. వైఎస్సార్ సీపీ సమన్వ యకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. నరసాపురంలో జేఏసీ నేతలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొని మాట్లాడారు. భీమడోలులో గోలి సుబ్బారావు అనే వ్యక్తి ఐదు రోజుల నుంచి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను వైద్య పరీక్షల కోసం ఏలూరు తరలించారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్‌లో రిలే దీక్షలు మంగళవారం ఏడవ రోజుకు చేరారుు
ఉప్పెనలా ఉద్యమం
Published Wed, Aug 7 2013 4:59 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement