హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల సమీపంలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యింది. దుండగులు.... మహిళను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కాల్చివేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం బండవెల్కిచర్ల సమీపంలోని మంటలు వస్తుండగా స్థానికులు గమనించారు. ఘటనాప్రాంతానికి వెళ్లి చూడగా అప్పటికే మహిళ మృతదేహం కాలిపోయింది. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి దహనం చేసినట్లు గుర్తులు ఉన్నాయి. కాగా మృతురాలి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
Published Thu, Nov 7 2013 8:30 AM | Last Updated on Sat, Aug 25 2018 4:52 PM
Advertisement
Advertisement