అవగాహనతో ముందుకు సాగుతా.. | Urban Development Action plan | Sakshi
Sakshi News home page

అవగాహనతో ముందుకు సాగుతా..

Published Tue, Nov 5 2013 3:14 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

Urban Development Action plan

 

=యాక్షన్ ప్లాన్‌తో నగరాభివృద్ధి
 =విధుల్లో చేరిన వరంగల్ కమిషనర్ సువర్ణ పండాదాస్

 
కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ‘హైదరాబాద్ జలమండలిలో ఆరు నెలలు.. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్‌గా తొమ్మిది నెలలు పనిచేశాను.. నగర పాలన పట్ల అవగాహన ఉంది... అంతేకాకుండా వరంగల్‌కు జిల్లాతో గతంలో పరిచయముంది.. తెలంగాణలో రెండో అతి పెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధి కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందుకు సాగుతాను’ అని కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి.సువర్ణ పండాదాస్ తెలిపారు.

విజయవాడ నుంచి సోమవారం రాత్రి 8-20గంటలకు వరంగల్ నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్న ఆయనబాధ్యతలు స్వీకరించారు. కమిషనర్‌గా తొమ్మిదో ఐఏఎస్ అధికారి అయిన పండాదాస్ ఈ సందర్భంగా కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. వరంగల్ నగర భౌగోళిక పరిస్థితులపై కొంత మేర అవగాహన ఉన్నా, ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు. అభివృద్ధి దిశగా సాగుతున్న వరంగల్ నగరానికి క్లీన్ సిటీ, హెరిటేజ్ సిటీ అవార్డుల వల్ల ఎంతో పేరొచ్చిందని తెలిపారు.

అందువల్ల అందరి ఫోకస్ వరంగల్ నగరంపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా, మంగళవారం నుంచి విభాగాల వారీగా సమీక్షలు చేయనున్నట్లు సువర్ణ పండాదాస్ చెప్పారు.యాక్షన్ ప్లాన్ తయారు చేసి నగర సమగ్రాభివృద్ధికి పాటు పడుతాననని, దీనిపై జిల్లా మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిపారు. కాగా, కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సువర్ణ పండాదాస్‌ను పలువురు బల్దియా అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement