శ్రీశైలంలో వేదిక్ లైబ్రరీ ప్రారంభం | vedivc library starts in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో వేదిక్ లైబ్రరీ ప్రారంభం

Published Sun, Sep 27 2015 5:03 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

vedivc library starts in srisailam

శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలోని భ్రామరీసదన్‌లో ఆదివారం వేదిక్ లైబ్రరి అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఈఓ సాగర్‌బాబు, కాకినాడ దేవాదాయ ఆర్‌జెసీ చంద్రశేఖర అజాద్‌లు ప్రారంభించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ వేదసంస్కృతి, సనాతన ధర్మం , హైందవ సంప్రదాయాలు, ఆచారాలు, తదితర అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

తాళపత్ర గ్రంథాలు, అరుదైన గ్రంథాలతో మొత్తం లక్ష గ్రంథాలను సేకరించాలనే సంకల్పంతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భాగవతం, ధర్మసింధు, నిర్ణయ సింధు, భగవద్గీత, భాష్యం తదితర అంశాలకు సంబంధించిన గ్రంథాలు కూడా ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement