భూమా మృతికి వెంకయ‍్య సంతాపం
హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల‍్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పట‍్ల కేంద్రమంత్రి వెంకయ‍్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా కర‍్నూలు జిల్లాలో అత‍్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని గుర్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో భూమా సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, ఆ విషాదం నుంచి కోలుకునే లోపే ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకోవడం దురదృష‍్టకరమని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటూ, వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.