నిడమనూరు పంచాయతీ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు | vigilance rides on nidamanuru panchayat office | Sakshi
Sakshi News home page

నిడమనూరు పంచాయతీ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు

Published Mon, Feb 9 2015 7:41 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

vigilance rides on nidamanuru panchayat office

నిడమనూరు(కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా నిడమనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని తమకందిన ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడ విజిలెన్స్ డీఎస్పీ పూర్ణచందర్‌రావు ఆధ్వర్యంలో మొత్తం ముగ్గురు అధికారులు పంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలపై మాట్లాడేందుకు అధికారులు నిరాకరించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని డీఎస్పీ పూర్ణచందర్‌రావు మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement